నాటికి మోదీకి ఇప్పటి మోదీకి ఇమేజ్‌లో ఎంతో వ్యత్యాసం యూసీల పేరుతో పార్టీ నేతల్ని పంపి హడావుడి చేసిన బీజేపీ నిధులు మంజూరు చేయాలని స్పష్టం చేసిన నీతిఆయోగ్ అవినీతి వైసీపీ ట్రాప్‌లో మోదీ ఢిల్లీ చిన్నబోయేలా అమరావతి నిర్మాణం అంటూ హామీ.
మోదీని నమ్మినందుకు, మోదీకి ఓటేసినందుకు ఓ వైపు బాధపడుతూనే వచ్చే ఎన్నిల్లో ఆయన దిగిపోవాలని కోరుకుంటున్నారు ఆంధ్రులు. ఎన్నికలకు ముందు ఎన్నో హీమీలు ఇచ్చిన మోదీ ఎన్నికల తర్వాత నమ్మించి మోసం చేశారని ఆంధ్రులు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఏపీ అంటే అన్నీ ఆపేయ్ అని చెప్తుందని అధికారులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2014 నాటికి మోదీకి ఉన్న ఇమేజ్‌కు ఇప్పటి ఇమేజ్‌కి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆయన చాలా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఆంధ్రకు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు జాతీయ ప్రాజెక్టులకు నిధులను కూడా ఆపుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చిన మోదీ.. ఇప్పుడు నిధులు కూడా ఆపుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతన్నారు. “మన రాజధానికి డబ్బులు ఇవ్వడానికి మనసొప్పదు కానీ… గుజరాత్లో పటేల్ విగ్రహానికి రూ.3వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇదేం న్యాయం” అని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. విద్యా సంస్థలకు రూ.11వేల కోట్లు అవసరం కాగా.. ఇప్పటికి 600 కోట్లు మాత్రమే ఇచ్చారని ఇలాగైతే 30సంవత్సరాలైనా వాటి నిర్మాణం పూర్తి కాదని మండిపడ్డారు.
అమరావతి శంకుస్థాపనకు వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లిన మోదీ.. 2014 ఎన్నికల ప్రచారంలో మోడీ చెప్పిన దానికి నాలుగున్నరేళ్లలో ఏపీకి చేసిన దానికి పొంతనే లేదు. ఏపీని అత్యంత దారుణంగా అవమానించారు కూడా. చరిత్రలో ఇంత వరకూ ఓ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఆ రాష్ట్ర ఖాతాలో వేసి వెనక్కి తీసుకున్న సందర్భం లేదు. ఆ కక్ష సాధింపును మొదటి సారి ఏపీపై చూపింది కేంద్రం. యూసీల పేరుతో.. పార్టీ నేతల్ని పంపి హడావుడి చేశారు. చివరికి యూసీలన్నీ సమర్పించారని.. నిధులు మంజూరు చేయాలని.. సంబంధిత.. నీతిఆయోగ్ స్పష్టమైన సూచన చేసినపప్పటికీ మోడీ నిధులివ్వలేదు. రైల్వే జోన్.. స్టీల్ ప్లాంట్.. పోర్ట్.. ఎన్నికల ముందు చెప్పినట్లు ఢిల్లీకి మించిన రాజధాని అన్నిటికంటే మించి ప్రత్యేక హోదా. తాము ఏపీ పట్ల ఉదారంగా ఉన్నామని చెప్పుకుంటే సరిపోతుందా? ఎమైనా చెయ్యాలి కదా?
కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌ను ప్రభుత్వమే ప్రైవేటు సంస్థల ద్వారా ముందుకు తీసుకెళుతుంది. విమానాశ్రయాల విస్తరణకు రాష్ట్రప్రభుత్వం భూములు ఇచ్చినప్పటికీ కేంద్రం పనులు చేయడంలేదని చంద్రబాబు తెలిపారు. అమరావతి నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసును కష్టపడి రాష్ట్రం తీసుకొచ్చింది. అది కూడా రాకుండా కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పైగా… కేసీఆర్‌కు పరిణతి ఉందని, నాకు లేదని పార్లమెంటులో విమర్శించారు. నాది యూటర్న్ అని, వైసీపీ ట్రాప్‌లో పడ్డానని మోదీ అనడం సిగ్గు చేటు. నాది యూ టర్న్ కాదు రైట్ టర్న్. నేను వైసీపీ ట్రాప్‌లో పడటం కాదు… మోదీయే అవినీతి వైసీపీ ట్రాప్‌లో పడ్డారు. అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన కష్టాల నుంచి గట్టెక్కిస్తారనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి న్యాయం చేస్తామని మోదీ ప్రతి సభలో హామీ ఇచ్చారు. ఢిల్లీ చిన్నబోయేలా అమరావతి నిర్మిస్తామన్నారు. కానీ, నాలుగేళ్లు కాలయాపనతో మోసం చేశారు. ప్రధాని మోదీ చెవుల్లో సీసం పోసుకుని పడుకున్నారు. ఎవరేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. విభజన హామీలు పరిష్కరించాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను ఢిల్లీకి వెళ్లి ఎన్నిసార్లు కోరినా వినిపించుకోలేదు అని చంద్రబాబు ఆక్రోశించారు. ఈ విధంగా చంద్రబాబు తన ఆక్రోశం వినిపిస్తుంటే రాజకీయాల కోసం కేంద్రం మాత్రం మంజూరైన నిధులను కూడా ఆపమంటూ అధికారులకు చెప్తుండడంతో మోదీపై ఆంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది.