కృష్ణా జిల్లా రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు దేవినేని నెహ్రూ తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దేవినేని అవినాష్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీకి సిద్దమైన అవినాష్ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోటీకి దింపే అవకాశం చంద్రబాబు తనయుడు లోకేష్‌కు సన్నిహితంగా ఉంటున్న అవినాష్.
విజయవాడ ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ తీవ్ర వ్యతిరేఖతలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 50వేల పైచిలుకు ఓట్లు పెనమలూరు బోడే ప్రసాదరావు తూర్పు నుంచి గద్దే రామ్మోహన్రావు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి బలమైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొడాలి నానిపై అవినాష్‌ను పోటీకి దింపే యోచనలో తెలుగుదేశం గుడివాడతో పాటు నూజివీడులో రాజకీయాలను బలోపేతం చేస్తున్న అవినాష్ ఇంటింటికీ టీడీపీ వంటి కార్యక్రమాలతో ప్రజలలోకి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సుపరిచితులు దేవినేని రాజశేఖర్ ఉరఫ్ నెహ్రూ.. కృష్ణా జిల్లా రాజకీయాలలో దివీటిలా ఎదిగిన నెహ్రూ అకాల మరణం తర్వాత ఆయన వారసుడు దేవినేని అవినాష్ రాజకీయాలలో చురుకుగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశంలో యువనేతగా ఉన్న దేవినేని అవినాష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. అయితే దేవినేని అవినాష్‌కు టిక్కెట్ ఎక్కడ దక్కనుంది? అవినాష్ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎంటి?
రాజకీయాల్లో వారసుల కాలం నడుస్తున్న విషయం తెలిసిందే. రాబోయే 2019 ఎన్నికల్లో నాయకులు తమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. అవసరమైతే తాము తప్పుకునైనా కూడా తమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా టీడీపీలో దాదాపు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నాయకులు అందరూ కూడా తమ తమ వారసులకు టికెట్లు ఇప్పించుకునే పనిలో బిజీ అయిపోయారు. ఇటువంటి పరిస్థితిలో తెలుగుదేశంలో యువనేత అవినాశ్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. గత ఎన్నికల్లోనే విజయవాడ ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దేవినేని నెహ్రూ వారసుడు అవినాష్ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 50వేల పైచిలుకు ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేఖత ఉన్న పరిస్థితిలో కూడా అవినాష్ అన్ని ఓట్లు దక్కించుకున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీలోకి వచ్చిన అవినాష్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ కీలకనేత నుంచే అవినాష్‌కు హామీ లభించడంతో టికెట్ ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ఎక్కడి నుంచి అవినాష్ పోటీకి దిగుతారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్‌కు సన్నిహితంగా ఉంటున్న అవినాష్.. ప్రస్తుతం టీడీపీ తెలుగు యువతకు అద్యక్షడుగా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దానిని విజయవంతం చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. మాస్లో దేవినేని ఫ్యామిలీకి ఉన్న గ్రిప్ వల్ల అవినాష్‌కు బ్రహ్మరథం పడుతున్నారు.
గతంలో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంకిపాడు విస్తరించి ఉన్న ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఈసారి ఆయన పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే గతంలో నెహ్రూ ప్రాథినిత్యం వహించిన కంకిపాడు ఇప్పుడు మూడు నియోజకవర్గాల్లో ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లో పెనమలూరు బోడే ప్రసాదరావు, తూర్పు గద్దే రామ్మోహన్రావు, గన్నవరంలో వల్లభనేని వంశీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
దీంతో టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై అవినాష్‌ను పోటీకి దింపే యోచనలో తెలుగుదేశ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది.
గుడివాడతో పాటు నూజివీడులో కూడా ఆయన ప్రస్తుతం రాజకీయాలను బలోపేతం చేస్తున్నారు. ఈ మేరకు పల్లె నిద్రలు.. ఇంటింటికీ టీడీపీ వంటి కార్యక్రమాలతో అవినాష్ ప్రజలలోకి చొచ్చుకుని పోతున్నారు. తన తండ్రి నెహ్రూ కేడర్‌ను కూడా చెదిరిపోకుండా కాపాడుకుంటున్న అవినాష్.. తన తండ్రి ఏ నిమిషంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉండేవారని.. ఆ ఫోన్ నంబర్ ఇప్పుడు కూడా మూగబోలేదని చెప్తూ కేడర్‌ను ఉత్సాహపరుస్తున్నారు. ముఖ్యంగా తనకు టికెట్లు లభిస్తాయని భావిస్తున్న రెండు నియోజకవర్గాలు గుడివాడ, నూజివీడుల్లో వారానికి నాలుగు రోజుల పాటు ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ముఖ్యంగా పేదలు, బడుగువర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేస్తున్న అవినాష్ యువనేత కావడం వల్ల యువతకు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఎన్నికల్లో యువత ఓట్లకే ఎక్కువగా రాజకీయ నేతలు ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనిని తనకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా విజయం సాధించాలని అవినాష్ భావిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే తన తండ్రిలాగా విజయం సొంతం చేసుకోవాలనే ఆయన ఆలోచన ఫలించే అవకాశం ఉంది. చూడాలి మరి అవినాష్ ఏ మేరకు సక్సెస్ అవుతారో..?