టీడీపీ కి మరో షాక్ ! ఆ ఎమ్మెల్యే వైసీపీ లో కి జంప్ చేయడం ఖాయమేనా !

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీలో అసంతృప్తితో ఉన్న మోదుగుల సైతం టీడీపీకి షాక్‌ ఇచ్చి వైసీపీలోకి జంప్‌ దాచేపల్లిలోని ఓ తోటలో రెడ్డి సామాజికవర్గం వారు వనసమారాధనను ఏర్పాటు చేయగా టీడీపీలో నా పరిస్థితి.. రెడ్ల స్థితి ఘోరంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలి 2009 ఎన్నికల్లో చివరి క్షణంలో నరసారావుపేట ఎంపీ సీటు దక్కించుకున్న మోదుగుల ఎంపీ సీటును త్యాగం చేసినందుకు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డ మోదుగుల కానీ 2014లో మోదుగులకు మంత్రి పదవి రాలేదు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన మోదుగుల గతకొంతకాలంగా వైసీపీ గూటికి చేరేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికల వేడి ప్రారంభం అయిన వేళ‌ రాజధాని జిల్లా గుంటూరులో వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు జనసేనలో చేరిన ఘటన మరవకముందే.. తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. టీడీపీలో అసంతృప్తితో ఉన్న మరో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి సైతం టీడీపీకి షాక్‌ ఇచ్చి వైసీపీలోకి జంప్‌ అయ్యేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఏపీలో సాధారణ ఎన్నికల వేడి ప్రారంభం అయిన వేళ‌ రాజధాని జిల్లా అయిన గుంటూరు టీడీపీకి షాకుల మీద షాకులు తప్పేలా లేవు. ఈ జిల్లా నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు టీడీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే వరసలో టీడీపీలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే మోదుగుల సైతం టీడీపీకి షాక్‌ ఇచ్చి వైసీపీలోకి జంప్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి గుంటూరు జిల్లాలో గత ఏడాది కాలంగా పార్టీ మారిన రావెల కిషోర్‌బాబుతో పాటు, గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి కూడా పార్టీ మారతారని వార్తలు వచ్చాయి. టీడీపీలో నిత్య అసంతృప్తి వాదులుగా ఉన్న వీరిద్దరిని సంతృప్తి పరచడం తమ వల్ల కాదని అటు చంద్రబాబు నుంచి ఇటు జిల్లా పార్టీ నేతలు కూడా చేతులు ఎత్తేసారు.

గత కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలోని ఓ తోటలో రెడ్డి సామాజికవర్గం వారు ఆదివారం వనసమారాధనను ఏర్పాటు చేయగా.. ముఖ్యఅతిథిగా హాజరైన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. తన సామాజిక వర్గంతో.. టీడీపీలో నా పరిస్థితి.. రెడ్ల స్థితి ఘోరంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలి.. గురజాలలో మనోడినే గెలిపించుకోండి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన పార్టీ మారడం దాదాపు ఖాయమే అన్నట్లు అందరూ భావించారు. అయితే అప్పటి నుండి పార్టీ ఎప్పుడు మారుతారు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.

అయితే తొలుత ప్రజారాజ్యంలో చేరి హడావిడి చేసి చివరకు ఆ పార్టీకి రాజీనామా చేసి 2009 ఎన్నికల్లో చివరి క్షణంలో నరసారావుపేట ఎంపీ సీటు దక్కించుకున్న ఆయన నరసారావుపేట లోక్‌సభ సెగ్మెంట్‌ పరిదిలో ఉన్న టీడీపీ అభ్యర్థుల ప్రభావంతో ఎంపీగా విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు గుంటూరు వెస్ట్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పించారు. తన ఎంపీ సీటును త్యాగం చేసినందుకు మంత్రి పదవి వస్తుందని మోదుగులు బహిరంగంగా చాలా సార్లు ప్రచారం చేసుకున్నారు. కానీ 2014లో మోదుగులకు మంత్రి పదవి రాలేదు. గత ఏడాది జరిగిన ప్రక్షాళ‌న‌లో సైతం తనకు గ్యారెంటీగా క్యాబినెట్‌ బెర్త్‌ వస్తుందని ఆయన ఆశించారు. అయితే అప్పుడు కూడా రాలేదు. దీంతో అలకభూనిన మోదుగుల పదే పదే ప్రభుత్వం, పార్టీపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన మోదుగుల గతకొంతకాలంగా వైసీపీ గూటికి చేరేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా జగన్ నుంచి మోదుగులకు బరోసా లభించినట్లు తెలుస్తుంది. దీంతో తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ్యత్వ నమోదుకు కూడా మోదుగుల దూరంగా ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ మారి పోటీ చేసేందకు నిర్ణయం తీసుకున్నారని నియోజకవర్గంలో ద్వితియ శ్రేణి నాయకులు పార్టీ అధినేత చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం. దీనిని బట్టీ మోదుగుల ఆవసరాలకు మాత్రమే ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నారని ఆయన మనసంతా వైసీపీలో ఉందని కూడా గుంటూరు జిల్లాలో చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైన గుంటూరు జిల్లా టీడీపీలో ఇప్పటికే రావెల రూపంలో ఫస్ట్‌ వికెట్‌ పడగా రెండో వికెట్‌ మోదుగులే అన్న టాక్‌ వినిపిస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: