పశ్చిమ తొలి జాబితాలో వీళ్లకు సీట్లు పక్కా?

Google+ Pinterest LinkedIn Tumblr +

అభ్యర్థులు ఎంపికలో కాస్త సీరియస్‌గా చంద్రబాబు దృష్టి సంక్రాంతి తర్వాత తొలి లిస్ట్‌ను విడుదల చేయనున్న తెలుగుదేశం గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తొలి లిస్ట్‌లో పశ్చిమగోదావరి జిల్లా అభ్యర్ధులు ఆరుగురు పేర్లను ఇప్పటికే ఖరారు చేసుకున్న తెలుగుదేశం.

తొలి లిస్ట్‌లో దెందులూరు ఎమ్మెల్యే విప్‌ చింతమనేని ప్రభాకర్‌రావు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఉండి ఎమ్మెల్యే కలువపూడి శివ, ఏలూరి ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పేర్లు చింతమనేనికి నియోజకవర్గంలో మంచి మార్కులు ఇటీవలకాలంలో చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా మారిన గన్నినరసాపురంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి సీనియర్‌ ఉన్నా నియోజకవర్గంలో మాధవనాయుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాడు భీమవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబుకు సీటు దక్కడం సందేహమే తెరపైకి రాజకీయ కుటుంబానికి చెందిన వారసుడు.

పశ్చిమ తొలి జాబితాలో వీళ్లకు సీట్లు పక్కా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీట్లు.. అభ్యర్థులు ఎంపికలో కాస్త సీరియస్‌గా చంద్రబాబు దృష్టి పెట్టారు. గత అనుభవాల దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా అభ్యర్ధుల ఎంపిక చేసి తొలి లిస్ట్‌ను విడుదల చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాత తొలి లిస్ట్‌ను చంద్రబాబు విడుదల చేస్తుండగా.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే కొందరు నాయకులకు సీట్లను పక్కా చేసినట్లు చెప్తున్నారు. సీట్లు ఫిక్స్ అయిన నేతలెవరు? అసలు విషయం తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలు రాబోతుండడంతో రాజకీయంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో గత మూడు ఎన్నికల్లో చివరివరకు సాగదీసి అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. పార్టీ చాలా నియోజకవర్గాల్లో సంస్థాగతంగా బలంగా ఉన్నా అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చేసిన చిన్న చిన్న పొరపాట్లుతో ఎన్నికల్లో స్వల్ప తేడాతో కొన్ని కీలక సీట్లను కోల్పోయింది. ఈ విషయాన్ని ఎన్నికల అనంతరం జరిగిన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఈ విషాయాన్ని పార్టీ గ్రహించింది. ఈ నేపథ్యంలో 2019లో అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు చంద్రబాబు ముందే వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తుంది.

2009 ఎన్నికల్లో నాడు జరిగిన ట్ర‌యాంగిల్‌ ఫైట్‌లో చంద్రబాబు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం చెయ్యడం కూడా ఆ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి. వచ్చే ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గత ఎన్నికలలో అనుసరించిన పంథాకు భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు గత ఎన్నికల స్ట్రాట‌జీ కంటే చాలా భిన్నంగా వచ్చే ఎన్నికల కోసం ఆయన వ్యూహాలు రెడీ చేస్తున్నారు. ఈ సంక్రాంతి తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 80 నుంచి 90 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటిస్తానని ఇప్పటికే బాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బాబు ఈ ప్రకటన చేసిన వెంటనే టీడీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా ఎక్కడా లేని జోష్‌ వచ్చేసింది. ఎవరెవరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, కొన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జులు తొలి లిస్ట్‌లోనే తమ పేరు ఉంటుందా ? అని చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన పశ్చిమగోదావరి జిల్లాలో అభ్యర్ధులను ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే కొందరి సీట్లను పక్కా చేసినట్లు చెప్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకంటే కూడా ఈ జిల్లాలో టీడీపీ టోటల్‌గా క్లీన్ స్వీప్‌ చేసేసింది. బీజేపీకి ఇచ్చిన సీటుతో కలుపుకుని జిల్లాల్లో రెండు ఎంపీ సీట్లతో పాటు 15 అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అయితే నాలుగున్నర ఏళ్లలో జిల్లా రాజకీయాల్లో వచ్చిన మార్పులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కొంత మంది వ్యతిరేఖత వ్యక్తం అవుతోంది. కొన్ని చోట్ల అనేక సమీకరణల నేపథ్యంలో సిట్టింగ్‌ల‌ను మార్చి కొత్త వారికి చోటు కల్పించనున్నారు. అయితే సంక్రాంతి తర్వాత రిలీజ్‌ అయ్యే తొలి లిస్ట్‌లో జిల్లా నుంచి ఎవరెవరి పేర్లు ఉంటాయన్న దానిపై కూడా అప్పుడే జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

తాజాగా అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం, జిల్లాలో నడుస్తున్న చర్చల ప్రకారం దెందులూరు ఎమ్మెల్యే, విప్‌ చింతమనేని ప్రభాకర్‌రావు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఉండి ఎమ్మెల్యే కలువపూడి శివ, ఏలూరి ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పేర్లు ఉండనున్నాయి. వీరికి తిరిగి ఛాన్స్‌ ఇవ్వడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవని సమాచారం. దెందులూరులో విప్‌ ప్రభాకర్‌ దూకుడుగా ఉన్నా అభివృద్ధి విషయంలో ఆయనకు మంచి మార్కులే ఉన్నాయి. తణుకు, ఉండి, పాలకొల్లు ఎమ్మెల్యేల విషయంలోనూ అటు అధిష్టానంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ మంచి మార్కులే ఉన్నాయి. ఏలూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడేటి బుజ్జికి మించిన ఆప్షన్‌ లేదు. ఉంగుటూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియోజకవర్గంలో అందరిని కలుపుకుని పోతుండడంతో పాటు అధిష్టానం వద్ద ఆయనకు మంచి మార్కులే ఉన్నాయి. ఇటీవల కాలంలో చంద్రబాబుకు గన్ని అత్యంత నమ్మకస్తుడిగా మారారు. తొలి జాబితాలో ఈ ఆరుగురు అభ్యర్థుల పేర్ల విషయంలో ఎలాంటి సందేహాలు, అభిప్రాయభేదాలకు తావు లేకపోవడంతో ముందు వీరి పేర్లే ఉండనున్నట్లు చెప్తున్నారు.

అలాగే మంత్రులు పితాని సత్యనారాయణ ప్రాధినిత్యం వహిస్తున్న ఆచంటలో తొలి జాబితాలోనే ఆయన పేరు ఉండడం గ్యారెంటీ. ఇక మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల విషయానికి వస్తే నరసాపురంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా తన పని తాను చేసుకుంటూ చంద్రబాబు వద్ద మంచి మార్కులు వేయించుకున్నారు. ఇంకా చెప్పాలంటే కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి సీనియర్‌ ఉన్నా ఆ నియోజకవర్గంలో మాధవనాయుడు సమన్వయంతో ముందుకు వెళ్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తీరుతో ఆయనకు కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ సీటు కోసం సుబ్బారాయుడు కూడా రేసులో ఉండడంతో ఇక్కడ సుబ్బారాయుడిని ఒప్పించి కాస్త ఆలస్యంగా అభ్యర్థి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక భీమవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబుకు సీటు దక్కడం సందేహమే అంటున్నారు. అక్కడ నుంచి ఓ రాజకీయ కుటుంబానికి చెందిన వారసుడి పేరు ప్రముఖంగా తెర మీదకు వస్తోంది. చూడాలిమరి ఎవరికి చివరకు సీట్లు దక్కుతాయో..>>?

Share.

Comments are closed.

%d bloggers like this: