మహారాష్ట్రలోని గ్రామాలు తెలంగాణాలో ఎందుకు కలుపమంటున్నారు?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉత్తరాధితో పోల్చుకుంటే దక్షిణాదిలో గ్రామాలలో కూడా సంక్షేమ పథకాలు అందరికీ అందుతుంటాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు తెలంగాణాలో కలపమంటూ ఆందోళన చేస్తున్నారు. తెలంగాణాలో వారు కలవడానికి ఎందుకు అంతగా కృషి చేస్తున్నారు. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

తెలంగాణాలో సంక్షేమ పథకాల ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండవసారి అధికారంలోకి రావడానికి ఆ పథకాలు కూడా తెరాస ప్రభుత్వానికి ఉపయోగపడ్డాయి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలోని అబ్బాయితో తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఓ ఊళ్లో అమ్మాయికి పెళ్లయింది. పెళ్లి చేసుకున్నందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద రూ. లక్ష ఇచ్చింది. ఇది విని అక్కడి అక్కడి వాళ్లు ఆశ్చర్యపోయారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని రైతులకు తెలంగాణలో భూములున్నాయి. వారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా పథకాలను వర్తింపజేస్తోంది. ఉచిత కరెంటు పథకాలను అందిస్తుంది. అయితే మహారాష్ట్రలో ఉన్న భూములకు ఇటువంటి పథకాలేమీ లేవు. అందుకే ‘కేసీఆర్‌ జీ.. హమ్‌ భీ తెలంగాణ మే ఆజాయేంగే’ అంటూ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు వినతులు పెట్టుకుంటున్నారు.

అవును తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. దీంతో తమ గ్రామాలను తెలంగాణలో చేర్చుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ధర్మాబాద్‌ తాలూకాలోని 40 గ్రామాల ప్రజలు, సర్పంచులు, ప్రజలు, అఖిలపక్ష నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన నాయకులు కూడా ఇందులో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా వారు ‘హమారే కో తెలంగాణ మే మిలాలేవో’ అంటూ నినాదాలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదంటూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో సగం కూడా ఇక్కడ లేవంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గానికి ఆనుకుని మహారాష్ట్ర సరిహద్దులో 40 గ్రామాలు ఉన్నాయి. వీరికి తెలంగాణ వారితో బంధుత్వాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు కావడం, తమ రాష్ట్రంలో అవేమీ లేకపోవడంతో తాము కూడా తెలంగాణలో చేరతామని కోరుతున్నారు. 40 గ్రామాల సర్పంచులు జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేపట్టారు. వీరు ఇప్పటికే తెలంగాణ ఎంపీ కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిలను కలిసి వినతిపత్రం కూడా అందజేశారు. తెలంగాణలో రూ.1000 పెన్షన్ ఇస్తుంటే.. మహారాష్ట్రలో కేవలం రూ.600 మాత్రమే ఇస్తున్నారని, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ప్రసూతి సాయం.. ఇలాంటి సంక్షేమ పథకాలేమీ లేవని, తమను తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే అవకాశం కలిపేస్తే అవన్నీ వర్తిస్తాయని తమకు అటువంటి అవకాశం కల్పించండంటూ కోరుతున్నారు. ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలుస్తామంటూ జేఏసీ అంటుంది.

వాస్తవానికి ఈ ఉధ్యమం నాలుగునెలల క్రితమే ప్రారంభం అయ్యింది. వారు ఉధ్యమం ప్రారంభించిన తర్వాత మా మహారాష్ట్ర మంత్రులు చర్చలు జరిపారు. వారి సమస్యలు అన్నింటినీ పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అయితే మాట మాత్రమే చెప్పారు. తర్వాత మరిచిపోయారు. ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కలిపే వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ వాళ్లు మరోమారు ఉధ్యమం చేపట్టారు. చూడాలి మరి వారి కోరిక తీరుతుందో లేదో..?

Share.

Comments are closed.

%d bloggers like this: