ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలగు రాష్ట్రాలలో బీజేపీకి ఉన్న బలం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మరీ దారుణం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పొత్తులో భాగంగా నాలుగు సీట్లు గెలిచారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆంధ్రలో ఆ పార్టీతో ఎవరు కూడా పొత్తులు పెట్టుకునే అవకాశం కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు కాన్వాయ్‌కి బీజేపీ నేతలు అడ్డుపడడం వెనుక కుట్ర దాగి ఉందా? కన్నా చెప్పిందేంటి?

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ.. కేంద్రంలోని అధికార బీజేపీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీపై చంద్రబాబు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు ప్రతిదాడిగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలు కూడా చంద్రబాబుపై విమర్శలు పెంచారు. ప్రధాని నరేంద్రమోడీని సంతృప్తి పరచడానికి సొంత రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని.. తీవ్రమైన పదజాలం వాడుతూ.. బీజేపీ నేతల తీరు.. ఇప్పటికే.. ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

అయితే తాజాగా కాకినాడ నాగమల్లితోట జంక్షన్‌ వద్ద చంద్రబాబు కాన్వాయ్‌కి అడ్డుపడుతూ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలు సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాన్వాయ్‌ను అడ్డుకున్న బిజెపి నేతలపై ఆ సమయంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి మోడీ ఏంచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉండేందుకు బిజెపి నేతలకు అర్హత లేదంటూ ఆవేశంగా తిట్టిపోశారు. రాష్ట్రానికి మోదీ చేసిన అన్యాయాన్ని మీరు సమర్థిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని మోడీ ముంచేశారని విమర్శించారు. ఇది జరిగిన తర్వాత బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఇంటిముందు తెలుగుదేశం నేతలు డౌన్ డౌన్ నినాదాలు చేశారు.

అయితే “లోకేష్, చంద్రబాబు ఆదేశాల మేరకే.. టీడీపీ కార్యకర్తలు నా ఇంటి మీదకు వచ్చారు. వాళ్లంతా నన్ను చంపడానికే వచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తా..” అంటూ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా తెలుగుదేశం నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌ను.. బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దానికి నిరసనగా.. టీడీపీ కార్యకర్తలు గుంటూరులోని కన్నా ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. కన్నా ఇంటి ముందు నిరసనను కుట్రగా అభివర్ణించిన కన్నా లక్ష్మీ నారాయణ.. టీడీపీ కార్యకర్తలు తనను చంపడానికే వచ్చారని.. అనడంపై ఇప్పుడు రాజకీయ నాయకులు కన్నా థియరీ ప్రకారమే మాట్లాడుకుంటే.. చంద్రబాబు కాన్వాయ్‌కి అడ్డుపడడంలో కూడా పెద్ద కుట్ర ఏమైనా ఉందా..? అని అంటున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏరోజూ ప్రయత్నించని బీజేపీ నేతలు.. చిన్నపాటి రాజకీయ ఆందోళనలను కూడా పెద్దగా చిత్రీకరించి కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామంటూ బెదిరిస్తూ.. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందంటూ హెచ్చరించడంపై ప్రజల్లో మరింత వ్యతిరేకతకు కారణం అవుతోంది. ఈ విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. గుర్తించినా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోలేకపోతున్నారు. టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తేనే.. తనను చంపడానికి వచ్చినట్లు చెప్పుకున్న కన్నా లక్ష్మినారాయణ.. కాకినాడలో బీజేపీ కార్యకర్తలు.. చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డు పడటం దేని కోసమో చెప్పగలరా..? చంద్రబాబును చంపడానికే బీజేపీ కార్యకర్తలు.. కాన్వాయ్‌కు అడ్డుపడ్డారా..? జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న… చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడం తీవ్రమైన నేరం అని.. బీజేపీ కార్యకర్తలకు తెలియదా..? తెలిసినా కూడా.. అదే పని చేయడానికి ప్రత్యేకంగా.. ఎందుకు కాపుకాశారు..? అంటూ విమర్శలు బీజేపీ నేతలు ఎదుర్కొంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: