ప్రభుత్వాలకు కేంద్రం ఝలక్‌ !

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం ఝలక్‌లు ఇస్తూనే ఉంది. తాజాగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పథకానికి కేంద్రం కొర్రీలు పెడుతూనే ఉంది. నిబంధనలు పేరుతో కేంద్ర ప్రభుత్వం వాటా చెల్లిచడం జాప్యం చేస్తుంది. దీంతో 60 శాతం ఇండ్ల నిర్మాణం పూర్తయినా కూడా కేంద్ర చెల్లిచపోవడం ఏంటీ అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం ఏంటి? కేంద్రం పెడుతున్న కోరీలు ఏంటి?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకానికి కేంద్రం కొర్రీలు పెడుతుంది. నిబంధనలు పేరుతో కేంద్ర ప్రభుత్వం తన వాటా చెల్లిచడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తుంది. 60 శాతం ఇండ్ల నిర్మాణం పూర్తయిన కూడా కేంద్రం తనవంతు వాటా చెల్లించట్లేదు. ఈ విషయాన్ని అధికారులు చెప్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ వ్యయంలో కేవలం కేంద్ర ప్రభుత్వం పదిశాతం వాటా ఇస్తుంది.. దానిలో కూడా నిబంధనల సాకుతో రకరకాల కొర్రీలు పెడుతూ సాగదీత ధోరణి అవలంబిస్తున్నది. ప్రభుత్వం నిర్మించే ఇండ్లలో లబ్ధిదారుల వాటా ఉండాలని, లబ్ధిదారుల పూర్తి వివరాలు తమకు తెలుపాలని పేర్కొంటూ నిధుల విడుదలను కేంద్రం నిలిపి వేసింది. ఫలితంగా మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్ చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల కు ఒక్కోదానికి 7.5 లక్షలు, మౌలిక సదుపాయాలకు 1.5 లక్షలు కలిపి మొత్తం 9 లక్షల వరకు ఖర్చవుతున్నది. ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కోఇంటికి 1.5 లక్షలు ఇవ్వనుండగా, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పేదలకోసం మొదటివిడుతలో లక్ష ఇండ్లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా సుమారు 97,300 ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. వీటికి దాదాపు రూ.8,500 కోట్లు ఖర్చవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మస్తుంది.. వీటికి దాదాపుగా 5,400 కోట్లు ఖర్చు అవుతుంది..

వీటిలో కేంద్ర ప్రభుత్వం వాటా పోగా మిగిలిన మొత్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. మొత్తం 109 ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టగా, దాదాపు 10వేల గృహాల నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. మిగిలినవాటి నిర్మాణం 60శాతానికిపైగా పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.1,500కోట్లు రావాల్సివుండగా, ఇప్పటివరకు రూ.590 కోట్లు మాత్రమే విడుదల చేసింది కేంద్రం. నిబంధనల సాకుతో మిగిలిన నిధులను కేంద్రం విడుదల చేయట్లేదు. ఇండ్ల నిర్మాణం దాదాపు 60 శాతానికిపైగా ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ 40 శాతంవరకు మాత్రమే నిధులు విడుదలచేసి చేతులు ఎత్తేసింది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలలో అత్యంత ప్రజాదరణ ఉన్నపథకం, అమలు చేయడం దాదాపు అసాధ్యం అయిన పథకం పేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు. అయినా కూడా ప్రతిష్టాత్మకంగా భావించిన కేసిఆర్ సర్కారు ఈ పథకాన్ని అమలు చేసేందుకు శాయశక్తల ప్రయత్నిస్తుంది. మనిషికి కూడు గూడు గుడ్డ కనీస అవసరాలు. ఈ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనివారి కోసం ప్రభుత్వం సహాయం చేస్తుంది. సొంత ఇల్లు ఉంటె ఒక భరోసా ఉంటుంది. నిలువ నీడ లేని వారికి ఇల్లు కట్టిస్తున్న ప్రభుత్వాలు, ఇప్పటివరకు లక్షన్నర రెండు లక్షలరూపాయలలో ఇల్లు కట్టిస్తున్నాయి. స్థోమత లేని వారు ఈ డబ్బుతో వచ్చినంత ఇల్లు కట్టుకుంటున్నారు. స్థోమత ఉన్నవాళ్ళు ఇంకొంచెం సొంత డబ్బు వేసి కాస్త పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. కెసిఆర్ మాత్రం తెలంగాణలో పేదలు అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానంటున్నారు. ఈ ఆలోచనకు కేంద్రం రాజకీయ కారణాలతో అడ్డుపడుతుందనేది తెలంగాణా ప్రభుత్వం వాదన. కేంద్రం నుంచి తగిన సహకారం లభించకపోవడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: