పవన్ సంతకంతో నోట్.. సీట్లు వారికేనా?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రశ్నించడమే అస్త్రంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పార్టీ జనసేన సోషల్ మీడియాలో స్ట్రాంగ్‌గా ఉంది. అయితే గ్రౌండ్ లెవల్‌లో మాత్రం ఆ పార్టీ తరుఫున ఎవరు పోటీ చేస్తారు? ఎవరికి అవకాశం ఉంది..? అధినేత చూపు ఎవరివైపు ఉంది? అనేది ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే ఇప్పుడు జనసేన సీట్లకు సంబంధించి ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అయితే అందులో వాస్తవమెంత నిజంగానే పవన్ సీట్లను కేటాయించారా? అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే..!!

జనసేన పార్టీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతుండడం చూస్తూనే ఉన్నాం. పవన్ కల్యాణ్‌తో ఫోటోలు దింపుతామంటూ కొందరైతే.. పార్టీలో పదవి ఇప్పిస్తమంటూ కొందరు ఇలా ఎన్నో మోసాలు చేస్తున్నారు. అయితే ఈ సారి మరింత వినూత్నంగా ఆలోచించారు. నేరుగా పవన్ కల్యాణ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. అభ్యర్థులను ప్రకటించేశారు కొంత మంది. ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. జనసేన లెటర్ ప్యాడ్ మీద, పవన్ కళ్యాణ్ సంతకంతో సోషల్ మీడియాలో వచ్చిన ఒక ప్రకటన వచ్చింది. అందులో ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించినట్లుగా ఉంది.

జనసేన లెటర్ ప్యాడ్ మీద, పవన్ కళ్యాణ్ సంతకంతో సోషల్ మీడియాలో వచ్చిన ఈ ప్రకటన జనసేన అభిమానులలో గందరగోళం సృష్టించింది. విజయవాడ సెంట్రల్ శాసనసభ అభ్యర్థి గా కోగంటి సత్యం, తూర్పు శాసనసభ అభ్యర్థిగా పోతిన మహేష్, పశ్చిమ శాసనసభ అభ్యర్థిగా కొరడా విజయ్ కుమార్ గారిని ఖరారు చేయడం జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ సంతకంతో వచ్చిన జనసేన లెటర్ ప్యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చాలామంది జనసేన అభిమానులు కూడా అభ్యర్థుల ఎంపిక ఈ మూడు స్థానాలకు ఖరారయింది ఏమో అని అనుకున్నారు. అయితే తరువాత తెలిసిన అంశమేమిటంటే ఇది ఎవరో సృష్టించిన నకిలీ లేఖ అని. దాంతో ఇదే సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ఖండన ప్రకటనను విడుదల చేసింది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న పొలిటికల్ పార్టీ ఏదంటే అనుమానం లేకుండా జనసేన అని చెప్పొచ్చు. బహిరంగ చర్చలకంటే సోషల్ మీడియా ద్వారానే పార్టీ అధ్యక్షుడు పవన్ కార్యకర్తలు, అభిమానులకు ఎక్కువ అందుబాటులో ఉంటారు. అభిమానులు సైతం సోషల్ మీడియాను వినియోగించుకునే పార్టీ ప్రచారాలను ఉదృతంగా నిర్వహిస్తున్నారు. అందుకే ప్రత్యర్థులు కొందరు అదే సోషల్ మీడియా వేదికగా పార్టీలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలో భాగంగానే జనసేన అధికారిక లెటర్ ప్యాడ్ పై పవన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రచారం మొదలుపెట్టారు.

మొదట ఈ ప్రెస్ నోట్ చూసి జనసేన శ్రేణులు దాదాపుగా నమ్మేశాయి. సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలుపెట్టాయి. అయితే ఆ లెటర్ విడుదలైన వెంటనే విషయాన్ని పసిగట్టిన జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం అది నిజమైంది కాదని, అభ్యర్థులను అధ్యక్షుడు మాత్రమే ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తారని క్లారిటీ ఇచ్చింది. అయితే సోషల్ మీడియా ఆధారంగానే ఎక్కువగా ప్రచారాన్ని ప్రకటనలను విడుదల చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నకిలీ లెటర్‌పై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఫోర్జరీ కేసు ఫైల్ చేయాల్సిందిగా జనసేన లీగల్ వింగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఫిర్యాదు చేయకపోతే.. మాత్రం పార్టీలో ఏదో జరుగుతోందని కార్యకర్తలు అనుమానపడే అవకాశం ఉందని అంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: