వజ్రం.. నవరత్నాల్లో ఇది కూడా ఒకటి. చాలా విలువైన రాయి ఇది. అంత సులభంగా పగలదు. అంత సులువుగా దొరకదు. కనుకనే ఇది చాలా విలువైందిగా మారింది. ఈ క్రమంలో వజ్రాలు పొదిగిన ఆభరణాలను చాలా మంది ధరిస్తున్నారు. అయితే, అసలు వజ్రాలు ఎలా తయారవుతాయో..? అవి ఎక్కడి నుంచి వస్తాయో మీకు తెలుసా..? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.
భూమిలోపల దాదాపుగా 140 నుంచి 190 కిలోమీటర్ల లోతున కొన్ని వేల సంవత్సరాల క్రితమే కూరుకుపోయిన పదార్థాల్లో ఉండే కార్బన్ అణువులతోపాటు అంత లోతున ఉండే అధిక ఉష్ణోగ్రత, పీడనం కారణంగా వజ్రాలు తయారవుతాయి. అయితే వజ్రాలు అంత సులభంగా తయారు కావు. అవి ఏర్పడేందుకు కొన్ని వందలు, వేల సంవత్సారల సమయం పడుతుంది. వజ్రం తయారయ్యాక అది లోపల ఉండే పీడనాన్ని తట్టుకోలేక భూమి పై పొరలకు వస్తుంది. అయితే వీటిలో అసలు, నకిలీలను గుర్తుపట్టడం చాలా కష్టం. మోజోనైట్ అనే రాయి అచ్చం వజ్రంలాగే వుంటుంది. వజ్రాల ఆభరణాలు కొనేముందు మోసపోకుండా జాగ్రత్త వహించాలి. మనం వజ్రాన్ని కొనేముందు నాలుగు విషయాల గురించి ఆలోచించాలి. 1) క్యారెట్ 2) కలర్ 3) కటింగ్ 4) క్లారిటీ.
ఇవన్ని సరిగ్గా వున్నాయని తేలిన తర్వాతే వాటిని కొనుగోలు చేయాలి. వజ్రాన్ని ఎలా కట్ చేశారన్నదే ఎంతో ముఖ్యమైన విషయం. క్లారిటీని పరీక్షించటానికి మాగ్నిఫెయింగ్ గ్లాస్ వుపయోగిస్తుంటారు. ఇది నగల దుకాణంలో లభిస్తుంది. ఆ గ్లాసునుండి చూస్తే డైమండులో మచ్చలుగానీ, బుడగలుగానీ, ఏవైనా గీతలుగాని వుంటే కనిపిస్తాయి. అసలైన వజ్రం స్వచ్ఛంగా, నిర్మలంగా వుంటుంది. శుద్ధమైన వజ్రం తెల్లగా వుంటుంది. బ్లూయిష్టీన్లో వుంటుంది. ఇది ఎంతో అందంగా వుంటుంది. దాని ధర చూసిగానీ, ఆకారాన్ని చూసిగానీ గొప్పదని అనుకోటానికి వీలులేదు. క్వాలిటీని పరీక్షించాలి. డైమండు, ఎంత చిన్నదైనా సరే నాణ్యత కలిగి వుండాలి. మార్కెట్లో రకరకాల సైజుల్లో వజ్రాలు లభ్యమవుతున్నాయి.
వాటి ఆకారాన్ని బట్టి ధర వుంటుంది. గుండ్రని ఆకారమున్న వజ్రం ఖరీదు ఎక్కువగా వుంటుంది. ఈ షేప్ రావడానికి కటింగ్లో చాలా భాగం ఎగిరిపోతుంది. ఇలాగే మార్ఫిస్, ప్రిన్సెస్ కట్ ఎమరాల్ట్కట్ త్రికోణాకార కట్ లాంటి ఎన్నో వుంటాయి. వజ్రం ప్రధానంగా 6 రంగుల్లో లభిస్తుంది. ఎరుపు, నీలం, పచ్చ, నలుపు, తెలుపు, బ్రౌన్ రంగుల్లో ఇవి లభిస్తాయి. చాలా మంది వజ్రం కొనుగోలు చేసేటప్పుడు ఎంతో ఉత్సాహంతో కొనుక్కుంటారు. కానీ తర్వాత దాని బాగోగులు గురించి అంతగా పట్టించుకోరు. ఈ కారణంగా కొనుగోలు చేసిన వస్తువులపై మట్టిపొరలు ఏర్పడతాయి. దీనికి వజ్రం మినహాయింపు కాదు, నూనె పొరలు ఏర్పడవచ్చు. శరీరం నుండి వెలువడే మలిన పదార్థాలు దానిపై పేరుకుపోయే అవకాశం
వజ్రం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే!!
Share.