అందరం కలిసి పోరాడాలి…. పవన్

Google+ Pinterest LinkedIn Tumblr +

స్పెషల్ స్టేటస్ అంటూ ఒకరైతే స్పెషల్ ప్యాకేజీ అంటూ మరొకరు ఇలా ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా అక్కడి పార్టీ వర్గాలు కేద్రంతో పోరాడుతూన్న విషయం తెలిసిందే. ఈమేరకు మంగళవారం నాడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విజయవాడలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలకి చెందిన నాయకులు హాజరు అవ్వాలని పిలుపునివ్వగా పలు పార్టీలకి చెందిన మంత్రులు హాజరయ్యారు.

ఇందులో భాగంగా జెనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ తరఫున మంత్రులు సోమిరెడ్డి, నక్కా ఆనంద్ బాబు, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, బీజేపీ నుంచి ఐవైఆర్ కృష్ణారావు.. సీపీఐ, ఆమ్ ఆద్మీతో పాటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ హాజరయ్యారు.
సమావేశం లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయాల గురించి విభజన తీరు గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించారు.
చర్చ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ”ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఏపీకి అన్యాయం జరిగిందని అందరూ అంగీకరించారని.. పార్టీలన్నీ ఏకతాటికి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా పోరాడకపోతే.. రాష్ట్రానికి ఇక ఎప్పటికీ న్యాయం జరగదన్నారు”.ఏపీ విభజన రాజ్యాంగ విరుద్ధమని , విభజన జరిగిన తీరును ఆయన తప్పుబట్టారు. ఎవరు ఏ లెక్కలు చెప్పినా.. రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నది వాస్తవమని గుర్తు పెట్టుకోవాలంటూ. ఈ అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలూ స్పందించాలని.. ఇప్పుడు గొంతెత్తకపోతే భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడతాయన్నారు.

ఉండవల్లి ప్రవేశపెట్టిన తీర్మానానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మాజీ మంత్రి ఉండవల్లి మాట్లాడుతూ ‘ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఎన్నో విషయాల్లో అన్యాయం జరిగిందని దెబ్బతగిలినప్పుడు ప్రతిస్పందించకపోతే సమస్య పరిష్కారం అవ్వదన్నారు. రాష్ట్ర విభజన తిరును ఆయన తప్పుబడుతూ , రాజ్యాంగం ఏర్పడ్డ తరువాత ఏ విభజన కుడా ఇలా జరగలేదన్నారు

Share.

Comments are closed.

%d bloggers like this: