మునుపెన్నడూ లేని విధంగా భారత క్రికెట్ జట్టు తనదైన రీతిలో సత్తా చటుతుంది.ముందు జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో కూడా విజయాన్ని కైవసం చేసుకొని క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాలు సృష్టించింది. భారత న్యూజిలాండ్ పర్యాటనలో ఇదే రీతితో ఇప్పటికే 3-0 తో చెలరేగుతోంది, కోహ్లీ సేన అటు బ్యాట్టింగ్ లోను బౌలింగ్ లోనూ అత్యుత్తమ ప్రదశన కనభరుస్తూ ఇప్పటికే రికార్డులు తమ సొంతం చేసుకుంటున్నారు.
హార్దిక్ పాండ్య రాకతో టీమ్ కి మరింత బలం చేకూరింది. విరామం లేకుండా అన్నీ ఫార్మాట్లు ఆడుతున్న కప్టెన్ కోహ్లీకి బిసిసిఐ విశ్రాంతి ప్రకటించిగా రోహిత్ శర్మా కప్టెన్ భాధ్యతలు ఛేపట్టనున్నాడు. తన సారధ్యంలో ఇది 200వ మ్యాచ్ అవ్వడం విశేషం. ఈ క్రమంలో 4వ వన్డే పట్ల ప్రేక్షకులకి ఇప్పటికే ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. 4వ వన్డే ఈ నెల 31 న సెడ్డన్ పార్క్ హ్యామిల్టన్ లో జరగనుంది, ఈ మ్యాచ్ కి మహేంద్ర సింగ్ ధోని ,విరాట్ కోహ్లీ మ్యాచ్ లో లేకపోవటం క్రికెట్ అభిమానులకి కాస్త ఆసంతృప్తిని ఇచ్చే విషయం. ఐతే వీరి స్థానాల్లో క్రికెట్ యాజమాన్యం బెంచ్ పై ఉన్న యువ క్రికెటర్లకి అవకాశం ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే బౌలింగ్ విభాగం కూడా చురుగ్గా ప్రదర్శించడం టీమ్ కి అధనపు బెనిఫిట్ గా భావిస్తున్నారు. గెలుపు ఎవరిది అన్న విషయం తెలుసుకోడానికి వేచి చూడాలి.