కేంద్ర ఆర్థిక శాక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో పోరాడుతున్న సంధార్బాన ప్రస్తుతం మోదీ తాత్కాలిక ఆర్ధిక శాక మంత్రిగా పీయూష్ గోయల్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. మధ్యంతర బడ్జెట్ ని ప్రకటించే సమయం వచ్చేసింది. మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆకర్షించేందుకు వరాలు కురిపించొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. బడ్జెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం, మధ్య తరగతి ప్రజలకు పన్ను ప్రయోజనాలు వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఉండొచ్చనేది సర్వత్రా వినిపిస్తోన్న మాట.
బడ్జెట్లో ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉంటాయో తెలియదు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం లో కొన్ని నెలలపాటు పలు పన్ను ప్రయోజనాలు ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వీటిని పొడిగించే అవకాశముందని తెలిపాయి.
ఈ మేరకు ఆర్ధిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘మధ్యంతర’ అనే పదం వాడకుండా ‘2019-20 బడ్జెట్’ అని ఉండడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని ‘మధ్యంతర’ బడ్జెట్‌గా పేర్కొంటూ మరో ప్రకటన విడుదల చేయడంతో సస్పెన్స్ మరింత పెరిగింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ తాత్కాలిక బడ్జెట్‌ను రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగించే ఒక ఆయుధంగా మలచుకోనున్నదన్న వాదన బలంగా వినిపిస్తుంది.