కివీస్ చేతిలో చిత్తుచిత్తుగా భారత్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇప్పటికే కీవీస్ పై సిరీస్ గెలుచుకున్న భారత్ 4 వ వన్డే లో చిత్తుచిత్తు గా ఓటమి పాలైంది. ప్రేక్షకుల, సెలెక్టర్ల అంచనాలు, ఆశలు విఫలమయ్యాయి. దీంతో 3-1 తేడాతో న్యూజిలాండ్ జట్టు ఒక్క విజయాన్ని దక్కించుకుంది. సెడ్డన్ పార్క్ హ్యామిల్టన్ వేదికగా జరిగిన 4వ వన్డే లో ఇండియా 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే అల్లౌట్ అయ్యింది. భారత బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమవ్వడమే ఈ పరాజయానికి కరణమైంది. ఏ ఒక్కరూ కూడా 18 మించి రన్లు చేయకపోడం ఆశ్చర్యకరం.

93 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు కేవల్ 14.4 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. లక్ష్య సధన లో భాగంగా రాస్ టేలర్ (37 నాటౌట్: 25 బంతుల్లో 2×4, 3×6), హెన్రీ నికోలస్ (30 నాటౌట్: 42 బంతుల్లో 4×4, 1×6) దూకుడుగా ఆడి విజయాన్ని సాధించారు. కివీస్ ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (5/21), గ్రాండ్‌హోమ్ (3/26) ధాటికి భారత ఆటగాళ్లు నిలవలేకపోయారు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘చాలా రోజుల తర్వాత భారత బ్యాట్స్‌మెన్ చెత్త ప్రదర్శన కనబర్చారు. ఇలా ఆలౌట్ అవుతామని మేము అసలు ఊహించలేదు. ఆ ఘనతంతా న్యూజిలాండ్‌ బౌలర్లకే దక్కుతుంది. చాలా అద్భుతంగా వాళ్లు బౌలింగ్ చేశారు. టీమ్‌లో కోహ్లీ, ధోనీ లేనందున ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించి ఉండాల్సింది. కానీ.. కొన్ని చెత్త షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నాం. అయితే.. స్వింగ్ అవుతున్న బంతిని ఎదుర్కోవడం ఎవరికైనా సవాలే’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. మ్యాన్ ఒఫ్ ద మ్యాచ్ అవార్డుని కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కి ఎంపిక చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: