అమెరికాలో భారతీయుల దీక్ష..

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్నాళ్ల నుంచి అగ్ర రాజ్యం అమెరికాలో అక్కడ వలసదారులు ఉండడానికి వీలు లేదంటూ యూఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.కానీ ఇప్పుడు మాత్రం ఈ చర్యలు కాస్త తీవ్ర రూపాన్ని దాల్చుతున్నాయని అక్కడ వస్తున్న కొన్ని నివేదికల ప్రకారం తెలుస్తుంది. ఇటీవలే యూఎస్ లోని అతి పెద్ద స్టేట్స్ లో ఒకటైన టెక్సాస్ లోని యూఎస్ వలసదారుల అధికారులు అక్కడ ఉన్నటువంటి కొన్ని దేశాలకు సంబందించిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నట్టు సమాచారం.

కొత్త సంవత్సరం ప్రారంభమైన మొదట్లోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు భారతదేశ మరియు క్యూబా దేశాలకు చెందిన వారిని వారి కుటుంబాలతో సహా దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆజ్ఞ్యాపించారు.దీనితో వారిలో కొంతమంది నిరాహార దీక్షలకు దిగారు.ఈ విషయంపై అక్కడ వచ్చిన ఒక నివేదిక ప్రకారంమొత్తం 11 మంది నిరాహార దీక్షకు దిగగా వారిలో కొంత మందికి తీవ్రస్థాయిలో డీహైడ్రేషన్ కు గురి కావడం,చాలా రోజుల నుంచి తిండి మానెయ్యడం వలన అక్కడి ఫెడరల్ జడ్జ్ ఈ జనవరి మధ్యలో వారికి అత్యవసర పరిస్థితుల్లో ద్రవాలను ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. బలవంతంగా ద్రవాలను శరీరంలోకి ఎక్కించేందుకు నాసల్ ట్యూబ్స్ ను వారి ముక్కు లోనుంచి ప్రవేశ పెట్టగా వారికి తీవ్ర స్థాయిలో రక్త స్రావం మరియు ఒక్క రోజులోనే ఎన్నో సార్లు వాంతులు అయ్యాయని తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: