మొన్న సెంట్రల్ లో అయితే నేడు స్టేట్ లో అన్నట్టుగా ఉంది బడ్జెట్ ఈ బడ్జెట్ ద్వారా ప్రజల్ని ఆకర్షించే విధంగా ప్రణాళికలు చేసి బడ్జెట్ ని రూపు దిద్దారు. ఎన్నికలు వస్తుండటంతో మొన్న బిజేపి ప్రబుత్వం ఎన్నడు లేని విధంగా మద్యంతర బడ్జెట్ అంటూ దానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనే పేరుతో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు.
ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి సమావేశాల సంధర్భంగా ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు ఉదయం 11.45గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గతేడాది బడ్జెట్ రూ.1,93,000కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఈసారి బడ్జెట్ 2.25 లక్షల కోట్ల మేర ఉండే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
లోక్సభ లో బిజేపి ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరులోనే అటు మద్యతరగతి కుటుంబాలని రైతులని ఆకర్షించే విధంగా ప్రణాళికలను రూపుదిద్దబోతున్నారా అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవ్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. బడ్జెట్లో ప్రజాకర్షక తాయిలాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వబోతున్నట్టు తెలుస్తోంది. రైతులకు వరాలు కురిపించడంతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లో పెద్ద పీట వేయబోతున్నట్టు సమాచారం. కాగా, జనవరి 30న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి.