బ్యాంకు రుణాల ఎగవేత ఆరోపణలతో విదేశాలకు పారిపోయి బ్రిటన్ లో తల దాచుకున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా, స్వదేశంలో కోర్టుల విచారణను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి రావాలని భావిస్తున్నారు. సుమారు రూ. 9,000 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో మాల్యా సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ల విచారణను ఎదుర్కొంటున్నారు. తన సంసిద్ధతకు సంబంధించి విచారణాధికారులకు సంకేతాలు పంపినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే పరారీలో ఉన్న ఎగవేతదారులకు దేశంలో, విదేశాల్లో ఉండే ఆస్తులను చట్టపరంగా జప్తు చేసుకునేందుకు వీలుగా కేంద్రం ఇటీవలే ఆర్డినెన్స్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం విజయ్ మాల్యపై పరారీలో ఉన్న ఆర్ధిక నేరగాడని ముద్ర పడనున్నది. ఈ ఆర్డినెన్స్‌కు అనుగుణంగా భారతదేశంతోపాటు విదేశాల్లో ఉన్న మాల్య ఆస్తులను జప్తు చేసుకునేందుకు అనుమతించాలని దర్యాప్తు సంస్థలు పిటిషన్లు దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.
మాల్య ను బరత్ కి తిరిగి పంపాలని బారత్ బ్రిటన్ ని కోరిన విషయం తెలిసిందే ఈ మేరకు మాల్యాను భారత్‌కు అప్పగించే ఆర్డర్‌పై బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ సోమవారం సంతకం చేశారు. కానీ ఈ వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి మాల్యాకు రెండు వారాల గడువు ఉంది. మాల్యా న్యాయ పోరాటానికి దిగిన పక్షంలో అతణ్ని భారత్ తీసుకొచ్చేందుకు మరో 7-8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మాల్యాను భారత్‌కు అప్పగించే ఆర్డర్‌పై సాజిద్ సంతకం చేసిన విషయాన్ని బ్రిటన్ హోం శాఖ ధృవీకరించింది.