ఇప్పటికే మంచి ఊపు మీద ఉన్నారు భారత ఆటగాళ్లు ఈ తరహాలో ఇది వరకు జరిగిన భారత్ నూజిలాండ్ పర్యటనలో భాగంగా 5 వన్డేల సిరీస్ గెలుచుకున్నారు. ఈ సంధార్బంగా క్రికెట్ అభిమానులకి ఒక పండగ లాంటి వాతావరణం నెలకొనింది. భారత ఆటగాళ్లపై ఎన్నో అంచనాలు వేసుకున్న సెలెక్టర్లకి అభిమానులకి ఒక చేదు వార్తా ఎదురైంది. ఈరోజు నుండే ప్రారంభమయిన టి-20 క్రికెట్లో తొలి మ్యాచులోనే కివీస్ పై చిత్తుగా ఓటమిపాలైంది.
ఈరోజు వెల్లింగ్టన్ వేధికగా మొదటి మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో కివీస్ చేతిలో కుప్పకూలారు భారత్ ఆటగాళ్లు. ధోని తప్ప ఏ ఒక్కరూ కూడా 39 రాన్లకి మించని వైనం. కేవలం 139 రాన్లకే అల్లౌట్ అయ్యి పరాజయం పాలయ్యారు. మునుపు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ పై నూజిలాండ్ 219 రాన్లకి ఆరు వికెట్లు కోల్పోయి ఒక చక్కటి లక్ష్యాన్ని ఇచ్చింది. అటు బౌలింగ్ లో కూడా హార్దిక్, భువనేశ్వర్లు తప్ప ఎవ్వరూ ఉత్తమ పరదర్శన ఇవ్వకపోడం బ్యాట్టింగ్ వైఫల్యమే ఈ ఓటమికి కరణాలయ్యాయి. మ్యాచ్లో కివీస్ బౌలర్లను భారత బ్యాట్స్మెన్స్ ఎదుర్కొలెకపోయారు . టిమ్ సౌదీ 3 వికెట్లు టిమ్ సీఫెర్ట్ 84 రాన్లు సాధించి మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు.