13 జిల్లాల యువ కిరణం..! దేవినేని అవినాష్

Google+ Pinterest LinkedIn Tumblr +

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు యువత అధ్యక్షత పధవిని దేవినినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ కి అప్పగించారు. ఈ సంధార్బంగా ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకరానికి వందలాదిగా యువత టిడిపి శ్రేణులు గుణదల నుండి ర్యాలీగా తరలివచ్చిన తెలుగు యువత. ఈ ప్రమాణ స్వీకరానికి బొండా ఉమా, గద్దెరామ్మహన్, బుద్దావెంకన్న, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మరియు పలువురు నేతలు ఎం‌ఎల్‌ఏ లు హాజరయ్యారు. టిడిపి వ్యవస్దాపకులు Ntr, దేవినేని నెహ్రూ విగ్రహాలకు పులమాల వేసి నివాళి అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అవినాష్ కి పదవి బాధ్యతలు అప్పగించినందుకు గాను పలువురు నేతలు హర్షాన్ని వ్యక్తం చేశారు. వేదిక పై సి‌ఎం చంద్రబాబు ని అవినాష్ ని ప్రశంసించారు.

గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ

అవినాష్ తెలుగు యువత అధ్యక్షుడు కావటం అనందంగా ఉంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ వంటి నేతలు తెలుగు యువత అధ్యక్షులు గా గతంలో పని చేశారు.. ఈ పార్టీలో యువతే ప్రధానం..అనాడు ntrకు పూర్తిగా సహకరించింది కూడా యువతే.. ఉన్నత మైన పదవి అవినాష్ కు దక్కింది..

మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ

అవినాష్ కి ఈ పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ లకి ధన్యవాదాలు. 13 జిల్లాల్లో తెలుగు యువత ని మరింత బలోపేతం చేయగల సత్తా అవినాష్ కి ఉంది. ఎన్టీఆర్ మరణం వరకు వెన్నంటి నిలిచి ఇచ్చిన మాట ప్రకారం పని చేసి చూపించే నేత నెహ్రు. చంద్రబాబు అవినాష్ పై అదే నమ్మకం తో ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పారు నెహ్రు ఆశయ సాధన ని అవినాష్ తప్పకుండా తీరుస్తాడు. పార్టీ ఆవిర్భావం నుంచి అసెంబ్లీలో దేవినేని కుటుంబం పేరు చిరస్థాయిగా ఉంది. అవినాష్ వలన టీడీపీ కి మరింత బలం చేకూరుతుంది.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళ వెంకట్రావు మాట్లాడుతూ

అవినాష్ కి పార్టీ లో మంచి భవిష్యత్తు ఉంది. చంద్రబాబు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నేత, అటువంటి నాయకులు అవినాష్ ని నమ్మారు. చంద్రబాబు తన అనుభవం తో రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ప్రధాని మోదీ చంద్రబాబు కన్నా చాలా జూనియర్ నాయకులు. బడుగు, బలహీన వర్గాలు తో పాటు అగ్రవర్ణ పేదలకు కూడా చంద్రబాబు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో అన్ని కులాలు అభివృద్ధి చెందే విధంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. నందమూరి వారసుడు హరికృష్ణ చేసిన తెలుగు యువత పదవిని నేడు అవినాష్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే సత్తా యువత లో ఉంది. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య యువత వారధిగా పనిచేయాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: