ప్రేమ పెళ్లిగా మారనుందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ భామ సొగసుల సుందరి ఆలియా భట్ట్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కొంత కాలంగా ప్రేమయానం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు వీరిద్దరి మధ్య చాలా రూమర్స్ ,గాచిప్స్ వస్తూనే ఉన్నాయి. ఇవి గాచిప్స్ మాత్రమేనా లేక నిజమా అని అభిమానులు తికమక పడుతున్నారు. అలియా తన లైఫ్ లో చాలా స్పెషల్ పెర్సన్ అని రణబీర్ చాలా సార్లు చెప్పాడు. అలియా తండ్రి, నిర్మాత మహేష్ భట్ కూడా తన కూతురు రణబీర్ ని ప్రేమిస్తుందని గతంలో మీడియా ముఖంగా వెల్లడించాడు. ఇక అప్పటినుండి బాలీవుడ్ లో వీరి ప్రేమ హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా మీడియా ముందుకొచ్చిన అలియాకి రణబీర్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. రణబీర్ తో పెళ్లెప్పుడు అని విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానంగా.. ‘గతేడాదిలో రెండు అందమైన వివాహ వేడుకలు(ప్రియాంక చోప్రా, దీపిక పడుకొన్ ల పెళ్లిళ్లు) చూశాం కదా.. కాబట్టి కొంతకాలం ఈ పెళ్లి వార్తల నుండి విరామం తీసుకోండి. ఇప్పటికైతే సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి” అంటూ అసలు విషయం చెప్పకుండా తప్పించుకుంది.
ప్రస్తుతం అలియా, రణబీర్ లు జంటగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అమితాబ్, నాగార్జున ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరి పెళ్లి గురించి వాస్తవం తెలుసుకోవాలంటే వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: