కిల్లర్ కి సుపారి.. కిల్లరే పోలీస్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విడాకుల విషయంలో భార్య వ్యవహారశైలితో విసిగిపోయిన ఓ భారత సంతతి వ్యక్తి నర్సన్ లింగాల(55) ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. తన భార్యని చంపేందుకు కాంట్రాక్టు కిల్లర్ కు సుపారీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ చివరికి పోలీసులు పన్నిన ఉచ్చులో పీకల్లోతు చిక్కుకుపోయాడు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.

యూఎస్ లోని ఇండియానాకు చెందిన నర్సన్ లింగాల(55)కు 1995లో వివాహమైంది. నర్సన్ 2011లో భార్య తో గొడవపడి విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే వారికో కొడుకు, కూతురు కూడా ఉన్నారు.. ఆస్తి పంపకాల్లో ఏకాభిప్రాయం రాక విడా కుల కేసు పెండింగ్‌లో ఉంది.

గతేడాది మే నెలలో వేరే కేసులో నర్సన్ మిడిల్‌సెక్స్ కౌంటీ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మరో ఖైదీని పరిచయం చేసుకొని తన భార్య హత్యకు ఒక కిరాయి హంతకుడిని చూపెట్టమన్నాడు. జూన్ లో కిల్లర్ ముసుగులో ఉన్న పోలీసును న్యూజెర్సీలోని ఓ షాపింగ్ మాల్ లో కలుసుకుని పథకం రచించారు. 5000-10 వేల డాలర్లకు బేరం కుదిరింది.

ఈ సమావేశానికి నర్సన్ ప్రియురాలు సంధ్యారెడ్డి కూడా హాజరు అయింది. వీరికి తెలియకుండా సంభాషణను పోలీసులు వీడియో తీశారు. ఆ వెంటనే వారిని చుట్టుముట్టిన పోలీసులు నర్సన్‌ను, సంధ్యారెడ్డి అరెస్టు చేశారు. గురువారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

Share.

Comments are closed.

%d bloggers like this: