శుక్రవారం(ఈరోజు) ఉదయం న్యూ ఢిల్లీ లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సమావేశమైన రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పై వ్యాఖ్యలు చేశాడు ‘రాఫేల్ స్క్యము’ ని మాటిమాటికి తీస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మోడి ఒక దొంగ అని , స్కామ్ లకి తోడ్పడుతున్నాడని ఆయన అన్నారు. తాను చేసిన కుట్రలు బయటపడుతున్నాయని ప్రజలకి కనపడుతుందని ఆయన అన్నారు.
మోదీ 30,000 కోట్లని స్వయానా తానే ప్రజా ధనాన్ని దొంగలించి అనిల్ అంబానికి ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఎయిర్ ఫోర్స్ విభగానికి అండాల్సిన నిధులని ధారి మళ్లించి అనిల్ అంబానీ కి ఇచ్చారని ఆయన అన్నారు.
దీనికి సంబంధించిన వ్యవహారాలనే ప్రస్తుతం ఫ్రెంచ్ గవర్నమెంట్ తో ఆయన మాట్లాడుతున్నారని సద్దుబాట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇది అందరికీ తెలిసిపోయిందని అర్దమవుతుందని ఆయన అన్నారు. తన స్క్యాము భట్టబయలు అయిందని మోడి ఒక చవ్కిదారు దొంగ అని విమర్శలు చేశారు.