కొల్కుంటున్న మధులిక…

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరాబాద్ బర్కత్పుర ప్రాంతానికి చెందిన మధులిక (17)పై వాళ్లింటి సమీపంలో ఉండే భరత్ అలియాస్ సోను (20) అనే యువకుడు బుధవారం (ఫిబ్రవరి 6) ఉదయం కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేశాడు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మధులికను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న భరత్ రెండేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. భరత్ వేధింపులు తీవ్రమవడంతో మధులిక నెల కిందట పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత అతడికి భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా.. అతడి ప్రవర్తనలో మార్పు కాకపోగా.. మధులికపై మరింత కోపం పెంచుకున్నాడు. తనను ప్రేమించడం లేదనే కక్షతో అమ్మాయిపై కొబ్బరి బొండాల కత్తితో దాడికి పాల్పడ్డాడు. పరిస్తితి తీవ్రమవడం తో ఆమెని వెంటనే మలక్పెట్ లోని యశోధా హాస్పిటల్ కి తరలించారు. అప్పటినుంచి విషమంగా ఉన్న ఆమె పరిస్తితి పై డాక్టర్లు బులిటన్ ఇచ్చారు.

‘ మధులిక ఆరోగ్య పరిస్థితి నిన్నటి తో పోల్చుకుంటే కొద్దిగా మెరుగు పడింది. 48 గంటల వైద్యం మంచి ఫలితాన్ని ఇచ్చింది. నిన్న 7 గంటల పాటు తనకు శాస్త్ర చికిత్స విజవంతం గా జరిగింది. ఇపుడు తాను కళ్ళు తెరిచి చూడగల్గుతుంది. బ్రెయిన్ లో ఉన్న అన్ని బొక్కల ముక్కలను తొలగించాం. ఎక్కడ ఎక్కడ బొక్కల విరిగిపోయాయో అన్ని రిపేర్ చేసాం. ఐదుగురు డాక్టర్ల బృందం చాలా కష్ట పడ్డాం కష్టానికి ప్రతిఫలంగా నిన్నటితో పోల్చుకుంటే ఇప్పుడు మధులికా పరిస్తితి కొంచం మెరుగు పడింది. ఇంకో 48 గంటల పాటు తన ఆరోగ్య పరిస్థితి విషమం గానే ఉండే అవకాశం ఉంది. చాలా బలమయిన గాయాలు అయ్యాయి కబ్బాటి తాను కొలుకోవడానికి సమయం పడుతుంది. చికిత్స విజయానికి చిహ్నంగా ఆమె స్పృహ లోకి వచ్చి చూడగల్గుతుంది. మరో 24 గంటల తర్వాత వెంటిలేటర్ పై నుండి బాధితురాలు ను తొలిగిస్తాం. శరీరం లో ఇన్ఫెక్షన్ జరగకుండా గాయాలు అయిన చోట మెరుగాయిన వైద్యం చేసాం 20 యూనిట్ల బ్లడ్ మరియు బ్లడ్ ప్రొడక్ట్స్ ఎకించం శరీరం లో గాయాలు ఆయన చోట సర్జరీ విజయవంతం గా చేసాం.. అని బులిటన్ రిలీజ్ చేసి జనాలకి మధులిక తల్లిదండ్రులకి కాస్త ఉపశమనం కలిగిగించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: