బాబు తో మంత్రివర్గ సమావేశం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతను వహించి రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు పలు తీసుకున్నారు. మంత్రివర్గం సమావేశం లోని నిర్ణయాలను రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు.

సమావేశం లో తీసుకున్న నిర్ణయాలు ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి 20 శాతం పెంచాలని, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి హెల్త్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

అమరావతిలో జేఎన్‌టీయూ ఎక్స్‌టెన్షన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని, విజయనగరం వర్సిటీకి గురజాడ అప్పారావు పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందని వెల్లడించారు.

రాష్ట్ర హక్కుల కోసం బాబ్లీకి వ్యతిరేకంగా పోరాడిన వారిపై కేసులు, ప్రత్యేక హోదా ఆందోళనలకు సంబంధించిన కేసులపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

ఏలూరు స్మార్ట్‌ సిటీ అంశం, అగ్రిగోల్డ్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు అభినందించడంపై చర్చించినట్లు వివరించారు.

పలు జిల్లాల్లోని ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం రూ.2వేల కోట్లు అవసరమని, ఈ నిధులను నాబార్డు నుంచి తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: