ఆడియో టేప్లే ఆయుధాలుగా..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎలాగైనా ప్రభుత్వంలోకి రావాలని కుట్ర రాజకీయాలు మొదలుపెట్టారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ కర్ణాటక సీఎం కుమార స్వామి తాజాగా ఆడియో టేపులు విడుదల చేశారు. దీంతో కర్ణాటకలో మరోసారి ఆడియో టేపుల కలకలం రేగింది. బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆడియో టేపులు విడుదల చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని యడ్యూరప్ప బేరాలు ఆడుతున్నట్లు ఆ ఆడియో టేపుల్లో ఉంది.

కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేవలం మూడు వారాల్లో రెండు సార్లు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై కుమారస్వామి మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలంటూ ప్రశ్నించారు. కాగా.. దీనిపై తాజాగా యడ్యూరప్ప స్పందించారు.

సీఎం కుమారస్వామి చేసిన ఆరోపణలను ఖండించారు. ఆ ఆడియో టేపులు నకిలీవని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం తమకు లేదన్నమాట వాస్తవేమనని.. కాకపోతే తాము సంకీర్ణ కూటమిని అస్థిరపరచడానికి ప్రయత్నించడం లేదని తేల్చిచెప్పారు. ఆ ఆడియో టేపులు నిజమని నిరూపిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటనానని సవాలు విసిరారు. ఇలాంటి నకిలీ ఆడియో టేపులు క్రీయేట్ చేయడంలో కాంగ్రెస్,. జేడీఎస్ నేతలు సిద్ధహస్తులన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: