ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ ఉలగనాయగన్ కమల్ హాసన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు క్షత్రియపుత్రుడు 2, శభాష్ నాయుడు చిత్రాలు చేయనున్నాడు. ఈ మూడు చిత్రాలని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత రాజకీయాలతో కమల్ బిజీ కానున్నట్టు సమాచారం.
అయితే 22 ఏళ్ళ తర్వాత కమల్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ చేస్తుండగా, ఈ సినిమా జనవరి 18 నుండి పొల్లాచ్చిలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంది. కొద్ది రోజుల తర్వాత సినిమాని ఆపేశారని , అందుకు కమల్ హాసనే కారణమని పలు వార్తలు వచ్చాయి.
దానికి స్పందిస్తూ కమల్ ‘ఇండియన్ 2 సినిమా నా వల్ల ఏమి ఆగలేదు.. షూటింగ్లకి రెగ్యులర్ గా వెలుతున్నానని ఆయన అన్నారు’ తన పైన వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన రూమర్స్ ని కొట్టిపారేశాడు. 180 కోట్లతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కమల్ కి జోడీ గా కాజల్ కథానాయికగా నటిస్తుంది. కాగా శింబు, దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రలు వహిస్తున్నారు. ప్రతి నాయకుడిగా అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ఇంత మంది నటించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక సినిమా గురించి త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.