మరో రెండు నెలలో క్రికెట్ ప్రపంచ కప్ ఆటలు ప్రారంభం కానున్నాయి.. ఆటగాళ్లు అందారు మంచి ప్రతిభను చూపుతున్నారు. ఒక వైపు ఆటగాళ్లలో సెలక్టర్లలో ఆసక్తి ఉంటే మరోవైపు ప్రేక్షకుల్లో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఆటలు ఎప్పుడొస్తాయ..? టీమ్ ఎలా ఉండబోతుంది..? టీమ్ లో ఎవరెవరు ఉంటారు..? అనే ప్రశ్నలతో సతమతమవుతున్నారు. భారత ఆటగాళ్లు ప్రతిఒక్కరు మంచి ఫామ్ ని కనబరుస్తున్నారు. ఈ తరహా లో ఎప్పుడూ టెస్ట్ క్రికెట్ లో ఆడే షమి వన్డే టీమ్ లో మంచి ప్రతిభ ని కనభరిచి ప్రపంచ్ కప్ టీమ్ లో మూడవ పెసర్ గా చోటు సొంతం చేసుకున్నాడు అనే చెప్పాలి.
అయితే బౌలింగ్ విభాగాన్ని పక్కకి పెడితే బ్యాట్టింగ్ ఆర్డర్ లో నెంబర్ 4 అల్ రౌండర్ స్థానాలు ఎవరివా అని టీమ్ ఎప్పటినుండో సతమతమవుతుందనే చెప్పాలి. అంబటి రాయుడు చక్కటి ప్రతిభ కనబరిచినప్పటికి ఆ స్థానం ఇంకా ఖరారు అవ్వలేదు. గత కొన్ని మ్యాచులలో మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోని నెంబర్ 4 లో వచ్చి అద్భుతంగా ఆడుతున్నాడనే చెప్పాలి. ఇలా నెంబర్ 4 గురించి సతమతమవుతున్నారు సెలక్టర్లు. ఆప్షనల్ కీపర్ గా పంత్ ఆ..? దినేష్ కార్తికా..? ఇలా మరెన్నో సందేహాలు ఉన్నాయి.
ఇలా ఎన్ని సందేహాలు ఉన్నపటికి ఏప్రిల్ 23లోపు టీమిండియా జట్టును ప్రకటించాల్సి ఉండటంతో సెలక్షన్ కమిటీ ఆటగాళ్ల ప్రతిభను జల్లెడ పడుతోంది. ఈక్రమంలో ప్రపంచకప్‌లో పాల్గొన బోయే భారత జట్టులో అజింక్య రహానె, రిషభ్ పంత్, విజయ్ శంకర్లకు చోటు లభించే అవకాశాలు ఉన్నాయని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.
ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ ‘తనకు వచ్చిన అవకాశాలను విజయ్ శంకర్ బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పటి వరకు అతడి ప్రతిభ బాగానే ఉంది. గత రెండేళ్లుగా అతడిని ఇండియా ‘ఏ’జట్టులో చూస్తూనే ఉన్నాం. ప్రపంచకప్ ఆడబోయే జట్టులో అతడు ఏ స్థానంలో సరిపోతాడో చూడాలి. అజింక్య రహానె గతేడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో వన్డేలు ఆడాడు. వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఓపెనర్ల జాబితాలో ఇతడిని మూడో ఆప్షన్‌గా ఎంచుకున్నాం. ప్రపంచకప్‌లో రహానెను ఆడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక పంత్ విషయానికికొస్తే అతడిని నిస్సందేహంగా వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోవచ్చు. గత ఏడాది కాలంగా అతడు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడు. అనతి కాలంలో పంత్ ఆటలో పరిణతి చెందాడు. అందుకే అతనికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం’ అని తెలిపారు.