తమిళ సూపర్ స్టార్ తళైవ రజినీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య పెళ్లి నేడు ఘనంగా జరిగింది. చెన్నైలోని ఎంఆర్సీ నగర్లోని లీలా ప్యాలెస్లో ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల ప్రాంతంలో వివాహ వేడుక జరిగింది. సౌందర్య, ప్రముఖ వ్యాపారవేత్త విశాకన్ వనగమూడి వివాహ వేడుక సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త విషాగన్ తో ఆమె పరిచయం పెళ్లికి దారితీసింది. ఈ వివాహానికి తమిళ నాడు ముఖ్యమంత్రి ఫలని స్వామి, స్టాలిన్, మోహన్ బాబు, లారెన్స్, అనిరుద్, సుబ్బిరామిరెడ్డి.. తదితరులు హాజరయ్యారు. వీరికి రజినికాంత్ పెద్ద అల్లుడు దనుష్ స్వాగతం పలికారు.
మూడు రోజులపాటు వీరి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి, వివాహం లో భాగంగా మెహెన్దీ, సంగీత్, ఫ్రే వెడ్డింగ్ ఫంక్షన్లు కార్యక్రమాలు జరిగాయి. సంగీత్ లో తాళైవ రజినికాంత్ ముత్తు సినిమా లోని ఒకడే ఒక్కడు మొనగాడు పాటకి స్టెప్పులు వేశాడు. అతిధులని అలరించాడు. వివాహం అనంతరం మంచి విందు ఏర్పాటు చేశారు.