మరోసారి సర్జికల్ స్ట్రైక్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

జమ్మూ కశ్మీర్‌, ఈ ప్రదేశాన్ని పాక్ తమదంటూ భారత్ తగదంటూ కొన్నేళ్లుగా జరుగుతున్న అల్లర్లు తెలిసినవే. ఉగ్ర దాడులు… వారిపై సైనిక ప్రతి దాడులు.. ఇవి ఇక్కడ సహజం. తాజాగా ఇక్కడ బారి ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది 40 మందికి పైగా సైన్యాన్ని ఉగ్రవాదం పొట్టనబెట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్‌ లోని పుల్వామాలో జైష్ ఎ మొహమ్మద్ సంస్థకి చందిన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దర్ అనే ఉగ్రవాది ఆత్మాహుతి దాడి జరిపి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నాడు. 350 కిలోల ఆర్‌డి‌ఎక్స్ మరికొన్ని పెళుడు పదార్థాలని వెంటబెట్టుకొని తన వ్యానుని సి‌ఆర్‌పి‌ఎఫ్ జవాన్లు ఉన్న చోటుకి ప్రవేశించి వారి మధ్యకి ధూసుకెళ్లి ఈ పేళ్లుళ్ళకి పాల్పడ్డాడు.

పేలుళ్ళకి ముందు మొత్తం 2000 మంది సి‌ఆర్‌పి‌ఎఫ్ జవాన్లు ఆ ప్రాంతానికి క్యాంప్ నిర్వాహణ కొరకు పయనమయ్యారు. మీడియా కి కూడా అందని ఈ సమాచారం ఉగ్రవాదులకి ఎలా తెలిసింది..? అసలు ఆ ఉగ్రావాదికి సమాచారం ఎలా వచ్చింది..? ఈ మారణహోమానికి ఎవరు సహకరిస్తున్నారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటనకి కేంద్రం ఎలా ప్రతీకారం తీర్చుకోబోతుందో వేచి చూడాలి.

ఆత్మాహుతి దాడి జరిపి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలపై దేశం మొత్తం రగిలిపోతుంది. ఈ మారణహోమాన్ని దేశ ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా జీర్ణించుకోలేకపోతోంది. సైనికుల త్యాగాలు వృధా కాబోవని ప్రధాని నరేంద్రమోదీ సహా కీలక స్థాయిలో ఉన్నవారంతా ప్రకటించారు. దీంతో కేంద్రం ఉగ్రదాడికి ఏ రకంగా కౌంటర్ ఇవ్వబోతోందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఉగ్రదాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రమూకలపై దృష్టి పెట్టిన కేంద్రం… మరోసారి సర్జికల్ స్ట్రైక్ తరహా దాడి జరిపి పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: