ఎవరోస్తారు… ఎవరు గట్టెకిస్తారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు దేగ్గరపడుతున్నాయి పార్టీ వర్గాలు సభలు ప్రచారాలతో జోరు మీదా ఉన్నాయి. ఈ పార్టీ వారు ఆ పార్టీ లోకి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి అన్నట్టుగా మారింది. ఎం‌ఎల్‌సి లు ఎమ్మెల్యే లు గా మారుతున్నారు. విబిన్న వర్గాల నుండి వేర్వేరు నియోజకవర్గాలనుండి పోటీ కి సిద్ధమవుతున్నారు. ప్రతి పార్టీ వారు దాదాపుగా నియోజకావర్గానికి ఒకరిని నియామకాలు చేస్తున్నారు. ఏ నియోజకవర్గాన్ని చూసిన పోటీ ధీటుగా ఉండేట్టు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉండగా జనసేన పార్టీ లో మాత్రం అంతా జోరు కనపడట్లేదు. కేవలం జనసేనాని పవన్, నాదెండ్ల మనోహర వీరు మాత్రమే ఎక్కువగా ప్రసంగాలలో సభలలో కనిపిస్తున్నారు.

త్వరలో ఎన్నికల షెడ్యూల్, ఆ తరువాత వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే జనసేనలోకి మాత్రం ఇప్పటి వరకూ కాస్త ప్రజాధరణ ఉన్న నేతలు ఎవరూ ప్రవేశించకపోవడాన్ని ఇప్పుడు ప్రస్తావించుకోవచ్చు.. అదేంటో మరీ చోద్యంగా.. నేతలు ఎవరూ జనసేన వైపు మొగ్గు చూపకపోవడాన్ని గమనించవచ్చు.

చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కాపు సామాజికవర్గం నుంచి కొందరు, కులాలకు అతీతంగా అనేకమంది వెళ్లారు. ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి చాలా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, అప్పటి తాజామాజీలు పోటీ చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి అప్పట్లో ఒక రేంజ్లో వలసలు సాగాయి. ఎన్టీఆర్ స్థాయిలో చిరంజీవి మ్యాజిక్ చేసే అవకాశాలు లేవని తెలిసినా.. చాలామంది ఆ పార్టీలోకి వెళ్లారు!

మరి ప్రజారాజ్యంతో పోల్చిచూసుకున్నా.. జనసేనలో మాత్రం కనీసం ఆ ఊపు కనిపించడం లేదు. ఇప్పటి వరకూ జనసేనలో చేరిన తాజా మాజీలు ఇద్దరు. వీరిలో ఒకరు బీజేపీ నుంచి వచ్చారు. బీజేపీకి భవితవ్యం లేదని.. తెలుగుదేశంలోకి మార్గంలేక.. ఆయన జనసేనలోకి వచ్చారు. ఇక మరో వ్యక్తి రేపటి ఎన్నికల్లో ప్రస్తుత స్థానంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసినా గెలిచే అవకాశాలు లేవు. ఆయన వైకాపాలోకి వెళ్లే ప్రయత్నం చేశారనేది బహిరంగ రహస్యం. అయితే అక్కడ ఛాన్స్ లభించకపోవడంతోనే జనసేన వైపు వెళ్లారు! ఇంకో రెండు నెలల గడువు లో ఎవరు రాబోతున్నారో పవన్ ని ఎవరు గట్టెకిస్తారో వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: