అర్జున్ రెడ్డి..! వర్మ..! ఆదిత్య వర్మ…!

Google+ Pinterest LinkedIn Tumblr +

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా తెలుగు చలనచిత్రా సీమలో మంచి హిట్ అందుకుంది. కేవలం మన రాష్ట్రాల్లోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఈ సినిమా కి భారీ స్పందన లభించింది. ఈ సినిమాని హింది లో కభీర్ సింగ్ అనే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వం లో రిమక్ చేస్తున్న విషయం తెలిసిందే.

తమిళ సూపర్ స్టార్ విక్రమ్ తన కొడుకు దృవ్ ని నటుడిగా పరిచయం చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి పుణ్యమా అంటూ విజయ్ దేవర్కొండ కి వరుస సినిమా ఆఫర్ల వర్షం కురిసింది. దీన్ని బేస్ చేసుకొని విక్రమ్.. దృవ్ కి కూడా అలాంటి ఆఫర్లే వస్తాయని దృవ్ ని అర్జున్ రెడ్డి రీమేక్ గా తీస్తున్న సినిమాతో పరిచయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ సినిమాకి ‘వర్మ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. దీనికి ముందు సందీప్ రెడ్డి వంగ నే దర్శకత్వం చేయాలని విక్రమ్ కోరారు. కాని తరువాత తమిళ ధర్శకుడు బాల ని నిశ్చయించారు.

అయితే సినిమా ఫైనల్ ఔట్‌పుట్ సంతృప్తికరంగా లేదనే కారణంతో… దర్శకుడు బాలను పక్కకు తప్పించి, మొత్తం సినిమాను మళ్లీ రీ షూట్ చేయాలని నిర్ణయించారు. రీ షూట్ చేయబోయే న్యూ వెర్షన్‌కు ‘ఆదిత్య వర్మ’ అనే టైటిల్ ఫైనల్ చేశారు. ఈ చిత్రాన్ని గిరీశయ్య దర్శకత్వం వహించబోతున్నారు. ధృవ్ సరసన బనితా సంధు హీరోయిన్‌గా ఎంపికైంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఇ4 ఎంటర్టెన్మెంట్ వారు… హీరో ధృవ్ తప్ప దర్శకుడు, మిగతా నటీనటులు, టెక్నీషియన్లు అందరినీ మార్చేశారు.

‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’ మూవీ విషయంలో జరుగుతున్న వివాదంపై ఆ చిత్ర దర్శకుడు బాలా స్పందించారు. నిర్మాతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ సినిమా నుంచి తానే తప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ గొడవపై తాను మాట్లాడటం మొదలు పెడితే ‘ధృవ్’ భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నానని బాల తెలిపారు. అయితే గొడవ ఎందుకు వచ్చిందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: