బాబు పై ధ్వజమెత్తిన రోజా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుల్వామ ఉగ్రదాడి కి దేశం లోని అన్నీ రాష్ట్రాలు స్పందించాయి. 44 మంది సి‌ఆర్‌పి‌ఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అయితే దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రధాని మోడి పై విభిన్న విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జరిగిన దాడికి ప్రధాని పూర్తి బాధ్యత తీసుకోవాలని 44 మంది జవాన్లు అమరులు అయినందున ప్రధాని బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన అన్నారు.

దీనికి స్పంధించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబు పై మండిపడ్డారు. పుల్వామా ఉగ్రదాడిపై కూడా చంద్రబాబు రాజకీయం చేయడం సిగ్గుచేటు అని ఆమె అన్నారు. దేశమంతా ఈ దాడిని ఖండిస్తుంటే… ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఈ ఘటనపై భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఉగ్రదాడికి బాధ్యత తీసుకుని ప్రధాని మోదీ రాజీనామా చేయాలని అంటున్న చంద్రబాబు… గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ ఎందుకు రాజీనామా చేయలేదని రోజా ప్రశ్నించారు. గోదావరి పుష్కరాలలో చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్ కారణంగానే 30 మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీటింగ్ కోసం ఓ రైతును దారుణంగా కొట్టి చంపారని రోజా ఆరోపించారు. ద్వంద్వ విధానాలు ఉన్న చంద్రబాబుకు తనకో నీతి.. మరొకరికి వేరే నీతి అన్నట్టుగా వ్యవహరించడం అలవాటేనని వ్యాఖ్యానించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: