ములుగు లో మినీ జాతర..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ములుగు జిల్లాగా ఆవిర్భవించిన వేళ.. భక్తుల కొంగుబంగారం గా విలసిల్లే మేడారం తల్లుల మినీ జాతర మొదలయ్యింది ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర మినీ మేడారం బుధవారం ప్రారంభమైంది, ఈ జాతర నాలుగురోజులపాటు కొనసాగుతుంది. ములుగు జిల్లాగా ఆవిర్భవించిన అనంతరం తొలిసారిగా జాతర జరుగుతుండటం విశేషం. మేడారం తల్లుల జాతరకు రాష్ట్రం నలుమూలనుంచే కాకుండా ఇతర రాష్ర్టాలకు చెందిన భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.

భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలను సమర్పించుకొని అమ్మవార్ల గద్దె ల వద్దకు చేరుకొని తమవెంట తీసుకొచ్చినఎత్తు బంగారం (బెల్లం)తో మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు తమ పిల్లలకు అన్నప్రాసన చేశారు. వందల ఎదురుకోళ్లు వంటి సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. జాతర శివసత్తుల పూనకాలతో హోరెత్తిపోయింది.

జిల్లా యంత్రాంగం భక్తులకు సకల సౌకర్యాలు కల్పించింది. భక్తులను క్యూలైన్‌ల ద్వారా దర్శనానికి అనుమతించారు. స్నానాల కోసం జంపన్నవాగులో షవర్లను ఏర్పాటుచేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. ప్రథమ చికిత్స అందించేందుకు వైద్యారోగ్యశాఖ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: