పుల్వామా ఉగ్రదాడి నేపధ్యంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులే కాదు ఇప్పుడు సెలబ్రితులు ఆటగాళ్లు కూడా పాకిస్తాన్ ని వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్ పై నిరసనాలకి దిగుదామని నిశ్చయించుకున్నారు భారత మాజీ ఆటగాళ్లు ఈ ఘటనని ప్రస్తావిస్తూ ఒక్కొక్కరుగా పాక్ పై విమర్శలు చేస్తున్నారు పాక్ తో ఆటలని బాయ్‌కాట్ చేయాలని బదులిస్తున్నారు.. ఈ క్రమంలో హర్బజన్ సింగ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాక్ తో జారగాల్సిన ఆటలని బహిష్కరించాలని వ్యాఖ్యానించాడు.
భారత్, పాక్ మ్యాచ్ గురించి తాజాగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ‘ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌పై ప్రజల మనోభావాల్ని నేను అర్థం చేసుకోగలను. పాక్ దుశ్చర్యకి భారత్ ధీటుగా బదులివ్వాలని వారు కోరుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా అదే.. అయితే.. ఒక్క క్రికెట్ పరంగానే కాదు.. హాకీ, ఫుట్‌బాల్ ఆటల్లోనూ ఆ దేశంతో ఆడకుండా తెగదెంపులు చేసుకోవాలి. భారత్ జట్టు లేకుండా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచకప్‌ని నిర్వహించడం కష్టం. కానీ.. ఐసీసీని ఎదిరించి పాక్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించే సాహసం చేయగలదా..? అనేది ఇప్పుడు తేలాలి. ఉగ్రదాడితో ఇక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశమే లేదు’ అని గంగూలీ వెల్లడించాడు.