వాళ్ళోస్తే దోచేస్తారు..! వీళ్లొస్తే రాజకీయం చేస్తారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రంపచోడవరం లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సి‌పి‌ఐ సి‌పి‌ఎం నేతలతో కలిసి సభ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ పలు అంశాల గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ ని అధికార పక్ష నాయకుడు చంద్రబాబు ని ఉద్దేశిస్తూ ఆయన విమర్శలు చేశారు. ఆయన స్పీచ్ లో భాగంగా పవన్ మాట్లాడుతూ .. కేసులు తీస్తారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడరు. వాళ్లు వెన్నెముక్క లేనివారు… అవసరానికో అడుగు పడతారు. మేము అలా కాదు మాట్లాడతాం…. మాకెలాంటి భయాలు లేవు. పాతిక కేజీల బియ్యం ఇవ్వడం కోసం పార్టీ పెట్టింది మీరు.. పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడం కోసం పార్టీ పెట్టాము.

ధైర్యంలేని ప్రతిపక్షనాయకుడు … వాళ్లనాన్న ఉన్పప్పుడు బాక్సైట్ పర్మిషన్ ఇచ్చేసాడు… మళ్లీ ముఖ్యమంత్రి జగన్ అయితే బాక్సైట్ పర్మిషన్ ఇచ్చేస్తాడు. మన దగ్గరనుంచి గ్యాస్ నిక్షేపాలు తీసుకుపోతున్నారు… అడిగేవారు లేరా…? వైసీపీ వస్తే అడ్డగోలుగా దోచేస్తారు… టీడీపీని మళ్లీ రానిస్తే అవకాశవాద రాజకీయం చేస్తారు. ఈ రోజు కాంగ్రెస్ తో జతకట్టిన టీడీపీ మళ్లీ మోడీతో జతకట్టడని ఏముంది..?

మేము అలా కాదు మాది అవకాశవాదం కాదు… మాటమీద నిలబడతాం..! నాది బలమైన భావజాలం … అదేనన్ను పార్టీని పెట్టేలా చేసింది. ప్రజాకాంక్షను కాపాడే చాలామంది బలమైన నాయకులు నాతో ఉన్నారు. అవినీతి రహిత పాలన ఆగిపోవాలి… ప్రజాపాలన రావాలి. ఇప్పుడు నేను పార్టీ నడుపుతున్నాను… నేను ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నా.. కులాలను భుజాలమీద వేసుకోను… నా భావజాలం ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నాను..అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: