కంట్లో వింతగా నులి పురుగు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కొద్ది నెలలుగా కంటి సమస్యతో బాదపడుతున్న బి.భారతి అనే మహిళ ఎందరో డాక్టర్లను ఎన్నో ఆసుపత్రులని మార్చింది ఎక్కడికెళ్లిన ఆమె నొప్పి ఆమె సమస్య మాత్రం నయం అవ్వట్లేదు. బంధుమిత్రుల సమాచారం మేరకు ఆమె విశాఖపట్నంలోని శంకర్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రిని సంప్రదించగా అక్కడ ఓ వింత బయటపడింది. అదేంటంటే ఆమె కంట్లో దాదాపుగా 15 సెం.మీ ల నాలి పురుగు కనిపించడం. కంటికి శస్త్ర చికిత్స నిర్వహించిన అక్కడి వైద్యులు నులిపురుగును బయటకు తీశారు.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన బి.భారతి అనే మహిళ కొంతకాలంగా కంటినొప్పితో బాధపడుతోంది. స్థానికంగా కొంతమంది వైద్యులను సంప్రదించి మందులు వాడినప్పటికీ కంటినొప్పి నయం కాలేదు.దీంతో కొంతమంది సూచన మేరకు శంకర్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. కంటికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుడు భువన్ ఆమె కంటి లోపల పురుగు లాంటి జీవి ఉన్నట్టు గుర్తించారు.

అయితే స్కానింగ్ రిపోర్టులో మాత్రం పురుగు కనిపించకపోవడంతో వైద్యులు అయోమయం చెందారు. స్కానింగ్‌కు ముందు సర్జరీ ద్వారా పురుగును తొలగించాలని భావించిన వైద్యులు.. స్కానింగ్ రిపోర్టులో పురుగు లేకపోవడంతో ఆపరేషన్ వాయిదా వేశారు. దీంతో భారతి ఆసుపత్రి నుంచి ఇంటికెళ్లి పోయింది. అయితే అదే రోజు రాత్రి ఆమె కంటిలో ఏదో కదులుతున్నట్టు అనిపించడంతో వెంటనే ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్ నజరిన్ వెంటనే శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు చేసి సర్జరీ పూర్తి చేశారు. సర్జరీలో ఆమె కంటి నుంచి సుమారు 15సెం.మీ పొడవున్న నులి పురుగును బయటకు తీశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: