వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి అందరికీ తెలిసిందే. ఎయిర్పోర్టులో ఈయన పై శ్రీనివాస్ అనే ఒక యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. దాడి చేసింది ఒక కోడి కత్తితో.. గాయం అయ్యింది జగన్ బుజానికి అవ్వడం వల్ల ఈ ఘటన పై అందరి దృష్టి పడింది. పలు రకాల వార్తలు గుప్పుమన్నాయి..
వైసీపీ నేతలు ఈ దాడిని చేయించింది చంద్రబాబే అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయడం లేదని వైసీపీ ఆరోపించింది. కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దాడి జరిగిన ప్రదేశం (విమానాశ్రయం లాంజ్) కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి జాతీయ సంస్థలకు దర్యాపు ఇవ్వొచ్చని భావించిన ధర్మాసనం కేసును ఎన్ఐఏకు అప్పగించింది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో రహస్య విచారణ చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణకు సంబంధించిన అంశాలు బయటకు రాకూడదని ధర్మాసనం ఆదేశించింది. కేసును రహస్యంగా విచారించాలని విజయవాడలోని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు, న్యాయవాదులు భద్రతా దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. కోర్టులో జరిగే విచారణకు సంబంధించిన వివరాలు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచరించడానికి కూడా వీల్లేదని పేర్కొంది.