ప్రధాని నిధి నుండి రైతు అకౌంట్లోకి 2000..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్రంలో ప్రధాని ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ మద్యంతర బడ్జెట్ ని తాత్కాలిక ఆర్ధిక శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. రైతులకి వరాల జల్లు కురిపించారు ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధీ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా ప్రతి ఒక్క రైతుకీ సంవత్సరానికి 6000 చొప్పున అకౌంట్లలో వేస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు చేయూతనందించేందుకు సిద్ధమైంది. మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అధికారికంగా ప్రారంభించడానికి రెడీ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం (ఫిబ్రవరి 24) నిర్వహించే రైతు ర్యాలీలో ప్రధాని మోదీ ఈ పథకాన్ని ఆవిష్కరించనున్నారు. దీంతో 12.5 కోట్ల మంది రైతులకు ఒక్కోక్కరికి తొలి విడత కింద రూ.2,000 అందనుంది.

ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి రూ.6,000 చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లోనే ప్రతిపాదించింది. మూడు విడతల్లో రైతులకు ఈ మొత్తం అందుతుంది. కేంద్రం ఒక్కో రైతు అకౌంట్‌లోకి రూ.2,000 చొప్పున మొదటి విడత నగదును బదిలీ చేయనుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: