కేసీఆర్ కొత్త సూత్రాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పల్లెల అభివృద్ధి కొరకు కేసీఆర్ కొత్తగా విధుల నిధుల విషయంలో మార్పులు చేశారు. పది సూత్రాలు పాటించమని ఆదేశించారు. పల్లెల అభివృద్ధి లో పంచాయితీ ప్రధాన పాత్ర పోషించాలని లేకపోతే వేటు తప్పదని ఆయన సెలువిచ్చారు. పంచాయతీ కార్యదర్శికి 30 రకాల విధుల్ని సూచించారు.
నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం విధులు, బాధ్యతలపై పంచాయతీ కార్యదర్శులు పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవడంతో గ్రామాల అభివృద్ధికి మార్గం సుగమమవుతున్నది. జిల్లాలో 220 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఇంతకాలం పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలంతా మళ్లీ పల్లెలకు తరలివచ్చేలా కొత్త పంచాయతీరాజ్ చట్టం తెలియజేస్తున్నది.

పాలకవర్గానికి పది సూత్రాలు…

• ప్రతి నెలా వీధి దీపాల పరిశీలన చేయాలి.
• నెలలో ఎన్ని కొత్త లైట్లు అమర్చారో నోటీస్ బోర్డుపై వివరాల నమోదు చేయాలి.
• ప్రతి నెలా పింఛన్లు ఎవరికి రావాలో, ఇప్పటి వరకు ఎన్ని పింఛన్లు ఇస్తున్నారో ప్రదర్శించాలి.
• నీరు, ఇంటి పన్నులు పెండింగ్, వసూళ్ల వివరాలను నోటీస్ బోర్డులపై సూచించాలి.
• పండుగల ఖర్చులు, నిధులు ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు చేశారో నోటీస్ బోర్డుపై ఉంచాలి.
• నెలలో ఒక వారంలో మరుగుదొడ్ల వాడకం, చెత్తకుండీల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు.
• గ్రామసభ నిర్వహించడంతో పాటుగా ప్రజల సమక్షంలో గ్రామంలోని అవసరాలను గుర్తించాలి.
• ప్రతి ఇంటి ఆవరణలో కనీసం నాలుగు మొక్కలు నాటించాలి.
• రేషన్ దుకాణాలకు ఎంత బియ్యం వస్తున్నాయి, ఎంత పంపిణీ అవుతున్నాయో తెలుసుకోవాలి.
• మరుగుదొడ్డి లేకుంటే కొత్తది కట్టించేలా చర్యలు తీసుకోవాలి.

పంచాయతీ కార్యదర్శుల విధులు…

• ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్ర స్థాయిలో సక్రమంగా వినియోగించాలి.
• పన్నుల వసూళ్లలో లక్ష్యం మేరకు పనిచేయాలి.
• భవన నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన అనంతరం 24 గంటల్లో అనుమతులు ఇవ్వాలి.
• పారిశుధ్య పర్యవేక్షణ ప్రతినిత్యం జరపాలి. సిబ్బంది పనితీరును గమనించాలి. చెత్త తరలింపు లాంటి వాటిపై తగిన చర్యలు తీసుకోవాలి.
• తాగునీటి సమస్యపై అధికారులకు తెలియజేస్తూ, పరిష్కార బాధ్యతను తీసుకోవాలి.
• గ్రామ పరిధిలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణను తొలిగించాలి.
• సర్పంచులతో కలసి పనులు పర్యవేక్షించాలి. ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలి.
• గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించాల్సిన తేదీని సర్పంచుకు తెలియజేయడం, సర్పంచ్ ఆమోదంతో సమావేశానికి ఏర్పాట్లు చేయడం. తీర్మానాలను ఈవోపీఆర్డీకి పంపడం.
• గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం, వచ్చే ఏడాదిలో చేపట్టే పనులను కూడా ప్రతిపాదించడం.

Share.

Comments are closed.

%d bloggers like this: