ప్రముఖ సినీ నటి శాండిల్ వుడ్ కి చెందిన విజయలక్ష్మి పరిస్థితి ఇప్పుడు సీరియస్ గా ఉంది అధిక రక్తపోటు తో అనారోగ్యానికి గురైన ఈమె కొంతకాలంగా ఆసుపత్రి లో ఉన్నారు. తన ఆర్ధిక స్థితి సరిగా లేకపోవడం చేత వైద్యానికి చేయూత కోరుతూ తన సోదరి అభిమానులను వేడుకోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది.
నాగమండల, సూర్యవంశ, నంబర్ ఇన్ సినిమాలతో కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. జగపతి బాబు – అర్జున్ మల్టీస్టారర్ గా నటించిన హనుమాన్ జంక్షన్ మూవీలో మరో హీరో వేణుకి జోడిగా, కథానాయకులకు చెల్లిగా నటించారు. ఆ సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విజయలక్ష్మి కొన్నేళ్ల అనంతరం సీరియల్స్ ద్వారా బిజీ అయ్యారు.
ఇక ఇటీవల అధిక రక్తపోటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు. అయితే గతంలోనే ఆమె తల్లిగారికి ఆరోగ్యం కోసం ఉన్న డబ్బు మొత్తం ఖర్చు చేయడం వల్ల ఇప్పుడు విజయలక్ష్మి దగ్గర రూపాయి కూడా లేదని అందుకే అభిమానులను ఆర్థికసహాయాన్ని కోరుతున్నట్లు ఆమె సోదరి చెబుతున్నారు.