వారు ముగ్గురు ఒక్క చెట్టు కొమ్మలు.. ఓటు వెయ్యొద్దు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపిప లో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ తరుణంలో అధికార పక్షం టీడీపీ ప్రతిపక్షం వై‌సీపీ అధినేతలిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. జగన్ తెలంగాణా సీఎం కే‌సి‌ఆర్ పట్టానా చెరీ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఇది వరకే చంద్రబాబు అన్నారు. గత కొంత కాలంగా టీడీపీ నుంచి నేతలు వల్సా కడుతున్న విషయం తెలిసిందే. అయితే జగన్ కే‌సి‌ఆర్ ఇద్దరూ కలిసి లోటస్ పాండ్ లో ఒక్కటై నేతలనీ భేదిరింపులు చేస్తున్నారని అందుకే ఇలా నేతలు వలుసలు కడుతున్నారని ఆయన అన్నారు.

తాజాగా శనివారం నాడు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క ఓటు కూడా వెయ్యనివ్వకుండా చూడాలంటూ నేతలకు సూచించారు. వైసీపీకి ఒక్క ఓటు పడినా అది కేసీఆర్‌కు, మోదీకి వేసినట్లేనని చెప్పుకొచ్చారు.

మూడు పార్టీలు కలిసికట్టుగా మాట్లాడుతున్న అంశాలే అందుకు నిదర్శనం అన్నారు. మూడు పార్టీలు కలిసి ఏపీపై కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆ పార్టీల కుమ్మక్కును ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత టీడీపీ నేతలదేనని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం విభేదాలు వీడాలని సూచించారు. చిరకాల ప్రత్యర్ధులు టీడీపీలో చేరుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనమని అభివర్ణించారు. కడప జిల్లాలో అందుకు ఆదినారాయణరెడ్డి -రామసుబ్బారెడ్డి, కర్నూలు జిల్లాలో కోట్ల-కేఈ కుటుంబాలే అందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: