తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్లు వేయమని కోరగా కేవలం మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ సంధర్భం గా మరి ఏ ఒక్కరూ నామినేషన్లు వేయకపోడం తో ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నికయ్యారు పద్మ రావు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
విపక్ష కాంగ్రెస్ పోటీకి దిగకపోవడంతో .. పద్మారావు గౌడ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఎన్నిక కాగా .. సోమవారం పదవీ బాధ్యతలను చేపట్టారు. సభా సాంప్రదాయం ప్రకారం పద్మారావు గౌడ్ ను సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రులు తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి .. పద్మారావుకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు.
డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికై బాధ్యతలు స్పీకరించిన పద్మారావు గౌడ్ కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. కార్మిక నేతగా మొదలైన రాజకీయ ప్రస్థానం డిప్యూటీ స్పీకర్ వరకు చేరిందన్నారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉత్సాహంగా పనిచేశారని చెప్పారు. టీఆర్ఎస్ నిర్వహించిన మొదటిసభను దిగ్విజయం చేసింది మీరేనని గుర్తుచేశారు. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని ప్రస్తావించారు. రెండుసార్లు కార్పొరేటర్ గా పనిచేసి నగర అభివృద్ది కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని .. గుడుంబాను అరికట్టడంలో కీ రోల్ పోషించారని సమర్థించారు. డిప్యూటీ స్పీకర్ నుంచి మరెన్నో పదవులు చేపట్టేందుకు ఆ భగవంతుడు దిర్గాయుస్షు కల్పించాలని కోరుకున్నారు.