కల్తీ మద్యం నలుగురి బలి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మద్యం తాగి మత్తులో మృతి చెందిన వార్తలను ఘటనలను మనం చాలానే చూశాం. కానీ మధ్యమే కల్తీ అయ్యి ఆ మద్యం తాగి చనిపోవడం ఈమద్య చాలా ఎక్కువగా వింటున్నాం. అయితే తాజాగా అసోం లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది మధ్యం కల్తీ అవ్వటంతో 150 మందికి పైగా మృతి చెందారు. ఈ విషయం ఇలా ఉండగా తాజాగా గాజువాక లో మధ్యం కల్తీ అయ్యింది ఇది గమనించని కొందరు ఆ కల్తీ మధ్యం సేవించి మృత్యు వాత పడ్డారు.

గాజువాక ఎస్టీ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగిన నలుగురు మృతి చెందారు. ఒక నల్ల కంటెయినర్లో తెచ్చిన మద్యాన్ని చాలామంది తాగారు. వారిలో తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. చికిత్సపొందుతూ అసనాల రమణమ్మ(70), కొండోడు(65) వాడపల్లి అప్పడు(65), సండ్ర అప్పలమ్మ(60) మృతి చెందారు. బాధితులంతా పందుల పెంపకం వృత్తిదారులుగా గుర్తించారు. పోలీసులు, అధికారులూ మాత్రం దీన్ని ప్రమాదంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. కల్తీ మద్యం అయితే చాలా పెద్ద కేసు అవుతుంది కనుక వేరే ద్రవాన్ని పొరబాటున తాగారని ప్రచారం చేస్తున్నారు. ఒక పక్క అసోంలో కల్తీ మద్యానికి 150 మంది బలైన నేపధ్యంలో గాజువాక సంఘటన ఆందోళన రేకెత్తిస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: