సర్జికల్ స్ట్రైక్ షురూ..! ఇక ఉగ్రవాదులకి హడలే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడి లో 44 మంది జవాన్లు అమరులయ్యారు. దీనికి భారత్ స్తంబించిపోయింది ప్రతీకార వాంఛ తో దేశం రగులుతుంది. ఇది వరకే ప్రధాని మోదీ ఈ దాడి పై స్పందిస్తూ 44 మంది జవాన్ల ప్రాణాలు ఊరికే పోనివ్వమని తప్పు చేసిన వారికి తగిన జవాబు చెప్తామని అన్నారు. ఆయన అన్న మాట ప్రకారం ఇవాళ ఉదయం 3 గంటల ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్ నేపద్యంలో భారత అయిర్ ఫోర్స్ కి చెందిన మిరాజ్ యుద్ధ విమానాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాదాపుగా 300 మందికి పైగా మరణించి ఉంటారు అని భారత ఆర్మీ భావిస్తుంది.

మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారి 3.45 గంటలు, పీఓకేలోని ముజఫర్‌బాద్‌లోని శిబిరంపై 3.48, చికోటీలో 3.58 గంటలకు మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడిచేసినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీకి సర్జికల్ దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ క్లుప్తంగా వివరించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సర్జికల్ దాడుల్లో 300 మంది వరకూ ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: