పాక్ ను తగలబెట్టాల్సింది- రాజ సింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

పుల్వామ దాడికి ప్రతీకారంగా నేడు ఉదయం భారత ఎయిర్ ఫోర్స్ 10 యుద్ధ విమానాలతో దాడి చేసింది. పాకిస్తాన్ కి చెందిన తీవ్రవాద దళాల శిక్షణ శిబిరాలే టార్గెట్ గా ఈ దాడి చేసింది. ఈ దాడుల్లో దాదాపు 300 మంది తీవ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. దాయాది దేశంపై మెరుపు దాడుల్ని యావత్ భారతం స్వాగతిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా వాయుసేనకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఉగ్రవాద దళాల అంతంపై, వైమానిక దళం జరిపిన దాడులపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. వాయుసేనపై ప్రశంసలు కురిపిస్తూ వీడియోను విడుదల చేశారు. ‘ఉదయం మన భారత సైన్యం పాకిస్తాన్‌‌ పై.. దాదాపుగా వెయ్యి కేజీల బాంబును పేల్చి వచ్చింది. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తామని మోదీ చెప్పారు.. అన్నట్లే చేశారు. ఈ ఘటనపై భారత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌కు భారత సైన్యం సరైన రీతిలోనే సమాధానం చెప్పింది. భారత ప్రజలకు అభినందనలు.. ఈ దాడులు జరిపిన భారత సైన్యానికి, ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు. ఇది శాంపిల్‌ మాత్రమే.. పాక్‌ను మొత్తం తగలబెట్టాలి. ఆ సమయం కూడా త్వరలో వస్తుంది.’అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: