ఈరోజు ఉదయం భారత ఎయిర్ ఫోర్స్ పుల్వామ ఘటనకి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది. భారత ఎయిర్ ఫోర్స్ 10 యుద్ధ విమానాలతో దాడి చేసింది. పాకిస్తాన్ కి చెందిన తీవ్రవాద దళాల శిక్షణ శిబిరాలే టార్గెట్ గా ఈ దాడి చేసింది. ఈ దాడుల్లో దాదాపు 300 మంది తీవ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.
పీఓకేలోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కి సంభందించి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో మంగళవారం నాడు సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరిగింది. అసలు సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేపట్టల్సొచ్చిందో ఆయా కారణాలెంటో సుష్మా చెప్పనున్నారు.
ఇవాళ సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలకు సుష్మాస్వరాజ్ వివరించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ, విజయ్ గోయల్‌తో పాటు పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి పలు పార్టీలకు చెందిన నేతలు సీతారాం ఏచూరి, గులాం నబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా, డి. రాజా తదితరులు పాల్గొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు దారితీసిన పరిస్థితులను వివరించనున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ఎంతమంది ఉగ్రవాదులను హతమార్చారనే విషయాన్ని కూడ ఈ సమావేశంలో కేంద్రం విపక్షాలకు వివరిస్తోంది.