స్వర పై నెటిజన్లు ద్వజం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుల్వామ దాడికి ప్రతీకారంగా భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ సరిహద్దులోకి చొరబడి బాల్కోట్ లోని ఉగ్ర శిక్షణ శిబిరాలపై బాంబులు విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి కి అనుమతిచ్చిన మోదీ దాడి మొదలు నుండి దాడి పూర్తయ్యెంతవరకు జాగారం చేశారు. అయితే ఈ జాగరణకి దేశవ్యాప్తంగా హర్షాలు వినిపించగా బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మాత్రం నెగిటివ్ గా మాట్లాడింది.

అయితే దీనిపై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ మోడీ రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారా.. అందులో గొప్పేముంది. అది ఆయన ఉద్యోగంలో భాగం” అంటూ ట్వీట్ చేసింది. ఇటువంటి సమయంలో స్వరాభాస్కర్ ఈ రకమైన కామెంట్ చేయడంతో నెటిజన్లు ఆమెను తప్పుబడుతున్నారు. ఆమెను దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మీకు పని దొరకక ఇలాంటి ట్వీట్ లు పెడుతున్నారని కొందరు. మీరు అర్బన్ నక్సల్ అంటూ కొందరు ఆమె పై విరుచుకపడ్డారు.

Share.

Comments are closed.

%d bloggers like this: