వరంగల్, హన్మకొండలో బుధవారం జరిగిన ప్రేమోన్మాది దాడి సంచలనం రేపింది. రవళి అనే యువతి బీకాం 3వ సంవత్సరం చదువుతుంది. కొంత కాలంగా సాయి అన్వేష్ అనే యువకుడి తో ఈమెకు ప్రేమాయణం నడిచింది. తన ప్రవర్తన సరిగా లేకపోవడం తో రవళి సై అన్వేష్ ని దూరం పెట్టింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అన్వేష్ రవళి పై బుధవారం నాడు యాసిడ్ తో దాయి చేశాడు. అతని కోపం అంతటితో చల్లారకా ఆమె పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడ ఉన్న కొంతమంది యువకులు నిందితుడు అన్వేష్ ని పోలీసులకి అప్పగించారు. సాయి అన్వేష్ ను రిమాండ్ కు తరలించిన పోలీసులు, అతనిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి విచారణ కొనసాగిస్తున్నారు.
వెంటనే రవళి ని ఔస్పత్రి లో చేర్చారు. డాక్టర్ల కధనం ప్రకారం రవళి శరీరం దాదాపుగా 90 శాతం కాలిపోయినట్టు తెలిసింది. అయితే యశోదా ఆసుపత్రి యాజమాన్యం తాజాగా రవళి పరిస్థితి ఏమాత్రం సరిగా లేదని ఆమె పరిస్తితి విషమం గా ఉందని తేల్చారు. ఆమె ప్రాణాలు సురక్షితంగా ఉండాలని ఆమెను ఎలాగైనా కాపాడాలని తన కుటుంబీకులు యాజమాన్యాన్ని గవర్నమెంట్ ని కోరుతున్నారు