సహో చాప్టర్ 2 మార్చి 3 న…!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కి ఎంతగానో క్రేజ్ పెరిగింది. ఆ స్థాయి మళ్ళీ హిట్ రావాలంటే హీరో మళ్ళీ అంతే కష్టపడాలి.. ప్రభాస్ ఇప్పుడు అదే రీతి లో కష్టపడుతున్నారట. బాహుబలి తరువాత దేశ వ్యాప్తంగా ప్రభాస్ కి ఫేమ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాని దేశ వ్యాప్తంగా విడుదల చేయాలని ఆ సినిమా నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఇందుకు గాను బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ని ఎంచుకున్న విషయం తెలిసిందే.

ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రేకెత్తించడానికి సహో చాప్టర్ 1 అంటూ ప్రభాస్ కి సంభందించి కొన్ని విజువాల్స్ ని ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేశారు. నిర్మాతలు ఊహించిన రీతిలోనే ఈ విజువల్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులో దుబాయ్ ఎపిసోడ్ ని, ప్రభాస్ లుక్ ని చూపించారు. ఇప్పుడు చాప్టర్ 2 అంటూ మరి కొన్ని విజువల్స్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే చాప్టర్ 2 లో ప్రభాస్ కంటే కీలకంగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ ని చూపించబోతున్నారని సమాచారం.

సినిమాలో ఆమె క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ ని వదలబోతున్నారు. మార్చి 3న శ్రద్ధాకపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను వాడులుతారని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ కనిపిస్తాడు కానీ ఎక్కువగా శ్రద్ధా కపూర్ కనిపిస్తుందని సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: