ప్రపంచపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హంజా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హంజా, అసలు ఎవరీ హంజా..? గత కొన్ని రోజులుగా అమెరికా నోట సౌదీ నోట ఈ పేరే వినిపిస్తుంది. హంజా ఎవరో కాదు ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ముద్దుల కొడుకు. లాడెన్ కి హంజా 15 వ సంతానం. హంజా లాడెన్ మూడవ భార్య ఖైరియా సబర్ కుమారుడు. ఆమెకు ఉన్న సంతానంలో హంజా ఒక్కడే కుమారుడు. ఖైరియా అంటే ఒసామాకు ఎంతో ఇష్టం. సౌదీకి చెందిన ఆమె మహమ్మద్‌ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తి. అమెరికా బయానికి ఖైరియా హంజా తో పాటు అనేక దేశాల్లో నివాసముండేది.

ఇది ఇలా ఉండగా అమెరికా చరిత్రలో అతిపెద్ద విషాదంగా నిలిచిపోయిన 2001లో సెప్టెంబర్ 11న ఉగ్రదాడులతో ప్రపంచమే దిగ్భ్రాంతికి గురైంది. విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు వాటితో ప్రపంచ వాణిజ్య కేంద్రం(WTO) టవర్స్‌ను కూల్చివేసిన ఉగ్రవాదు సంస్థ అల్ ఖైదా. అల్ ఖైదా పై దాని అధినేత లాడెన్ పై అమెరికా కన్నెర్ర చేసింది. ఈ ఘటన జరిగిన పదేళ్ళ తరువాత ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్ననాటికి అమెరికా కమాండోలు పాక్ లో చొరబడి లాడెన్ ను మట్టి కల్పించారు. అప్పటి నుండి అల్ ఖైదా కి సరైన అధినేత లేరు.
అయితే ఇప్పుడు హంజా ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. అమెరికా అంచనా ప్రకారం సిరియా లోనో ఇరాన్ లోనో హంజా తల దాచుకున్నట్టు తెలుస్తుంది. ఇది వరకే హంజా తన తండ్రి ని చంపిన వారి పై పగ తీర్చుకుంటానని చెప్పాడు. ఇక అప్పటినుండి హంజా ని అమెరికా ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటన చేసింది తన ఆస్తులను బ్లాక్ చేసింది. అమెరికా ఇన్ని చర్యలు చేపట్టినా హంజా మాత్రం రోజురోజుకి ఎదుగుతూనే ఉన్నాడు. ప్రముఖ ఉగ్రవాది కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఇద్దరు సంతానం కూడా ఉన్నట్టు సమాచారం.

అల్ ఖైదా కధనాల ప్రకారం హంజా ఇప్పుడు అల్ ఖైదా అధినేతగా తన తండ్రి సింహాసనాన్ని అదిరోచించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అల్ ఖైదా ని నడపడానికి హంజా సిద్ధమయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత తెలిసిన అమెరికా ఉరుకుంటుందా..? ఈపాటికే అమెరికా ఎన్‌ఐ‌ఏ హంజా పై సీక్రెట్ మిషన్ ప్రారంభించేసిందట. తన ఉనికిని ఎవరైనా చెబితే వారికి 7 కోట్ల బహుమతిని ప్రకటించింది. ఇదే క్రమంలో సౌదీ ప్రభుత్వం లో కొన్నేళ్లు హంజా ఉన్నందున సౌదీ ప్రభుత్వం కూడా హంజా ఉన్నట్లు ఎవరైనా తెలిపితే 7 కోట్ల బహుమతులని ప్రకటించింది. హంజా వారసత్వాన్ని కూడా నిలిపివేసింది. ప్రపంచ దేశాలన్నిటికి ఈ వార్తా ని అమెరికా తెలియజేస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: