అనుమానాలు ఎక్కువయ్యి తగాదాలు చూశాం. భార్య భర్తలు విడిపోవటం చూశాం కానీ భర్త కి అనుమానం వచ్చిందని ఉరేసుకుంది చెన్నై కి చెందిన ఓ మహిళ. తన భర్త తో కొన్ని నెలలుగా చిన్న చిన్న తగాదాలు వచ్చాయి. కొద్ది రోజులుగా అవి ఎక్కువయ్యాయి. దీనికి మనస్తాపం చెంది ఊ మహిళ ఆత్మ హత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చెన్నై మదురవాయల్ సమీపం నూంబల్ మెయిన్ రోడ్డు ప్రాంతానికి చెందిన 24 సంవత్సరాల నల్లయా ఓ సంస్థలో ప్రవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య గిరిజ (22) వలసరవాక్కంలోని ఓ ప్రైవేట్ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. వీరీద్దరూ రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా గిరిజ ఫోన్లలో ఎక్కువగా మాట్లాడటం చూసిన నల్లయా ఈ విషయమై గిరిజని హెచ్చరించాడు. గింజ అంతా అనుమానం మొదలయ్యింది దీంతో కొన్ని రోజులుగా చిన్న చిన్న గొడవలు అలకలు.
ఈ నేపద్యం లో నల్లయా మళ్ళీ గిరిజ మాట్లాడటం గమనించాడు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన నల్లయ ఇంటి పనులు ఏమి చేయకుండా ఫోన్ లో మాట్లాడుతున్న గిరిజ పై చికాకు పడి తన పాటికి తను వెళ్ళి నిద్రపోయాడు.. మరి ఏం జరిగిందో ఎంటో గిరిజ మనస్తాపానికి గురయ్యి వేరే రూమ్ లో ఉరేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.